Palla Rajeswar Reddy Speech on Runa Mafi : రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ ఆర్థిక పరిస్థితుల వల్లే ఆలస్యం అయిందని రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.20,500 కోట్లు రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధపడిందని పేర్కొన్నారు. ఇప్పటికే రైతుబీమా కింద లక్ష మందికి పైగా రైతులకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. దాదాపు రూ.1200 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారని చెప్పారు. మిగిలిన నగదును ఈరోజు నుంచి సెప్టెంబర్ రెండు, మూడు వారాల వరకు విడతల వారిగా రైతు రుణమాఫీ పూర్తి చేస్తారని వివరించారు. దీనికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజలకి సమయానుకూలంగా పథకాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తుందని వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.75 వేల కోట్లలను రైతులకి ఇచ్చిందని తెలిపారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క గంట కూడా తప్పకుండా 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందని అన్నారు.
CM KCR on Rhythu Runa Mafi : రైతన్నలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రుణమాఫీ రెండో విడత షురూ..
Palla Rajeswar Reddy Comments on Congress Party : కాంగ్రెస్ 2014, 2018లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నా.. ప్రజలు నమ్మలేదని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ లక్ష రూపాయలు దశాల వారీగా ఇస్తామని చెప్పారని.. ఆ విధంగానే చేశామని తెలిపారు. రెండో సారి కూడా అలానే చెప్పారని.. అది అమలు చేయబోతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రైతుల కోసం తెలంగాణ తరహా పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కాలేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పట్ల రైతులు ఆనందంగా ఉన్నారని తెలియజేశారు. రాష్టంలో 60 శాతం రైతులు ఉన్నారని.. వారందరూ సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం, రైతులు సంతోషంగా ఉన్నప్పుడు.. ప్రతిపక్ష పార్టీలు ఎందుకు అని ప్రశ్నించారు.
రుణమాఫీకి ఎవరు అర్హులు : 2018 ఎన్నికల తేదీ ముందు లక్ష కంటే తక్కువగా ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయనున్నారు. ఇంతక ముందు ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు ఏలాంటి మార్గదర్శకాలు పాటించిందో.. అవే పాటించనున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ రైతు రుణమాఫీ ఇవ్వలేదని.. భవిష్యత్తులో కూడా ఇచ్చే పరిస్థితిలో లేదని ఆరోపించారు. రాష్ట్రంలో రుణమాఫీతో ఆ పార్టీ అంధకారంలోకి వెళుతుందని విమర్శించారు.
"ఆర్థిక పరిస్థితుల వల్లే రుణమాఫీ ఆలస్యం జరిగింది. రూ.20,500 కోట్లు రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమయింది. సెప్టెంబర్ రెండో వారం వరకు విడతల వారీగా రుణమాఫీ పూర్తి చేస్తాం. రైతుబీమా కింద లక్ష మందికిపైగా రైతులకు రూ.5 లక్షల చొప్పున చెల్లింపులు జరిగాయి. రైతుల కోసం తెలంగాణ తరహా పథకాలు ఏ రాష్ట్రం కూడా అమలు చేయట్లేదు. 2018లోపు బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు ఉన్న అందరికీ మాఫీ చేస్తాం. మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ రుణమాఫీ వర్తిస్తుంది. కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నా.. ప్రజలు నమ్మలేదు." - పల్లా రాజేశ్వర్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు
ఇవీ చదవండి :