ETV Bharat / state

వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయా.. ఈ సూచనలు మీకోసమే..! - భారీ వర్షాల ప్రభావం

రాష్ట్రంలో భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న పంటలపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా వరి పంట బాగా దెబ్బతిని రైతులు నష్టపోయారు. పెద్ద ఎత్తున వరి పంట దెబ్బతిన్నట్లు అంచనాలు వెలువడుతున్న దృష్ట్యా.. పంట కాపాడుకోవడం కోసం రైతులను అప్రమత్తం చేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రంగంలోకి దిగింది. ఖమ్మం, నల్గొండ, యాదాద్రి, నిజామాబాద్, కామరెడ్డి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య చర్యలపై శాస్త్రవేత్తలు సూచనలు, సలహాలు తెలియజేశారు.

paddy-damage-precautionary-measures-by-scientists

author img

By

Published : Oct 9, 2021, 7:08 PM IST

రాష్ట్రంలో వానాకాలం సీజన్​లో వరి పంట సుమారు 50 లక్షల ఎకరాలు పైగా విస్తీర్ణంలో సాగవుతోంది. పంట వివిధ దశల్లో ఉంది. అధిక శాతం చిరుపొట్ట, పొట్టదశ నుంచి పూత, కోత దశల్లో ఉన్నాయి. ముందుగా నాట్లు వేసిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వరి పంట గింజ పాలుపోసుకునే దశలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబరు ఆఖరి వారంలో కురుస్తున్న అధిక వర్షాలకు వరి పంటలో చేపట్టాల్సిన చర్యలను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచించింది. రాష్ట్రంలో గులాబ్‌ తుపాను ప్రభావంతో చాలా ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట నీటమునిగి రైతులు భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ పి.రఘురామిరెడ్డి రైతులకు చేసిన సూచనలు..

  • అధిక వర్షాలకు తెగుళ్ల ఉద్ధృతి అధికంగా ఉంటుంది.
  • గింజ పాలు పోసుకునే దశలో ఉన్న వరి పంట పొలంలో నీరు నిల్వ ఉండకుండా కాలువల ద్వారా నీరు బయటకు తీయాలి.
  • పడిపోయిన వరి పైరును నిలబెట్టాలి.
  • అధిక వర్షాల వల్ల గింజ మచ్చ తెగులు, మెడ విరుపు తెగులు అధికమయ్యే అవకాశం ఉంటుంది.
  • 20 నుంచి 25 రోజుల్లో వరిపైరు కోతకు వస్తుందన్న సందర్భాల్లో మాత్రమే.. వర్షం లేని రోజున తెగుళ్ల మందులు పిచికారీ చేయాలి.
  • వరి పంట చివరి దశలో గింజ పట్టిన తర్వాత పిచికారి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
  • గింజ మచ్చ, మెడ విరుపు తెగులు గమినించినట్లైతే.. ట్రైప్లాక్సిస్రొబిన్ + టెబ్యుకొనజోల్ 80 గ్రాములు పిచికారీ చేయాలి.
  • ఒకవేళ గింజ మచ్చ తెగులు మాత్రమే గమనించినట్లైతే.. 200 మిల్లీ లీటర్లు ఎకరానికి పిచికారీ చేయాలి.
  • గింజ గట్టిపడే దశలో వరి పైర్లలో కాటుక తెగులు గమనించినప్పుడు.. తెగుళ్ల మందులు పిచికారీ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
  • వర్షాలు తగ్గిన తర్వాత రెల్లరాల్చు పురుగు ఆశించి వరి వెన్నులు కత్తిరించి నష్టపరిచే అవకాశం ఉంది.
  • కాలుక తెగులు నివారణ కోసం ఎకరానికి క్లోరోఫైరిఫాస్ 500 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి.
  • వరి పైరు పూత ఉన్నప్పుడు వర్షాలు అధికంగా కురిసినట్లైతే కాటుక తెగులు, గింజ మచ్చ, మెడ విరుపు తెగులు అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది.
  • పూత దశలో ఉన్న వరి పైర్లలో వర్షాలు తగ్గిన వెంటనే.. ఎకరానికి ప్రొపికొనజోల్ 200 మిల్లీ లీటర్లు లేదా ట్రైప్లాక్సిస్ట్రోబిన్ + టెబుకొనజోల్ 80 గ్రాములు.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిచికారీ చేసినట్లైతే మచ్చ, కాటుక తెగులు నివారించుకునే అవకాశం ఉంది.
  • అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల మెడవిరుపు తెగులు కూడా ఆశించే అకాశం ఉంటుంది.
  • పూత దశ నుంచి గింజ పాలుపోసుకునే సమయంలో మెడవిపుపు లక్షణాలు గమనించినట్లైతే ట్రైసైక్లోజోల్ + మ్యాంకోజెబ్ 500 గ్రాములు లేదా ఐసోప్రోధయోలిన్ 320 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 500 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేయాలి.
  • మెడ విరుపు తెగులుతోపాటు పొట్ట కుళ్లు, కాటుక, గింజ మచ్చ తెగులు గమనించినట్లైతే ట్రైప్లాక్సిస్ట్రోబిన్ + టుబుకొనజోల్ 80 గ్రాములు ఒక ఎకరం విస్తీర్ణంలో పిచికారీ చేయాలి.
  • పొట్టకుళ్లు, గింజమచ్చ తెగులు, కంకి నల్లి లక్షణాలు గమనించినట్లైతే డైకోఫాల్ 1000 మిల్లీలీటర్లు లేదా స్త్రైరోమెసిప్పిన్ 200 మిల్లీలీటర్లు + ప్రొపికొనజోల్ 200 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారి చేయాలి.
  • చిరుపొట్ట దశలో ఉన్న వరి పైర్లలో అధిక వర్షాలోపాటు ఆకుముడత, కాండం తొలిచే పురుగు, పాము పొడ, బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉంది.
  • అధిక వర్షాల వల్ల ఆకుముడత పురుగు ఉద్ధృతి అధికమయ్యే అవకాశం ఉంటుంది.
  • వర్షాలు తగ్గిన తర్వాత ఆకుముడత, కాండం తొలిచే పురుగు నివారణకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 50 శాతం ఎస్పీ 500 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 60 మి.లీ. ఎకరానికి పిచికారీ చేయాలి.
  • వరిలో పాముపొడ తెగులు గట్ల వెంబడి మొక్కలపై గమనిస్తే హెక్సాకోనజోల్ 400 మి.లీ. లేదా ప్రొపికోనజోల్ 200 మి.లీ. లేదా వాలిడామైసిన్ 500 మి.లీ. లేదా ట్రైప్లాక్సిస్టోబిన్ + టెబుకొనజోల్ 80 గ్రాములు ఎకరానికి పిచికారి చేయాలి.
  • పాలమూరు ఉమ్మడి జిల్లాలో చిరుపొట్ట దిశగా వరి పైర్లలో ఆకునల్లి ఉద్ధృతిని క్షేత్రస్థాయిలో గమనించిన దృష్ట్యా నివారణకు డైకోఫాల్ 1000 మి.లీ. లేదా స్పైరోమెసిప్పిన్ 200 మి.లీ. చొప్పున ఎకరానికి పిచికారి చేయాలి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.