హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్‌ను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం ప్రారంభించారు. రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నిధులతో దీనిని నిర్మించినట్లు వీసీ తెలిపారు. దాదాపు రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హాల్లో 300 మంది భోజనం చేసేలా సకల సదుపాయాలు కల్పించినట్లు వివరించారు. అతిథులు ఉండడానికి నాలుగు లగ్జరీ సూట్స్‌ను నిర్మించామని అన్నారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, డైరెక్టర్ పార్థసారథి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పంటపొలాలను కాటేస్తున్న "ఫార్మా" కాలుష్యం