ETV Bharat / state

ఓయూ విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతల అరెస్టు

ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పర్శతో అమరవీరుల స్థూపం అపవిత్రమైందంటూ పసుపు నీళ్లతో శుద్ధి చేసేందుకు వచ్చిన నాయకులను పోలీసులను అరెస్టు చేశారు. గెజిటెడ్​ ఉద్యోగుల సర్వీసు పొడిగించడంపై నాయకులు మండిపడ్డారు.

ou jac leaders arrested at gunpark in hyderabad
అమరువీరుల స్థూపాన్ని శుద్ధి చేసేందుకు వచ్చిన నాయకుల అరెస్టు
author img

By

Published : Jun 5, 2020, 10:30 PM IST

హైదరాబాద్​లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసేందుకు వచ్చిన తెలంగాణ నిరుద్యోగ, ఓయూ ఐకాస నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. గెజిటెడ్ ఉద్యోగుల సర్వీసు పొడిగింపును నిరసిస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్ స్పర్శతో అపవిత్రమైందంటూ గన్​పార్క్ అమరవీరుల స్థూపాన్ని పసుపుతో శుద్ధి చేసేందుకు వచ్చిన వారిని సైఫాబాద్ పోలీసులు అడ్డుకున్నారు.

గన్​పార్క్ వైపు దూసుకెళ్లేందుకు వెళ్లిన ఐకాస నాయకులు కూటూరి మానవతారాయ్, కొప్పుల ప్రతాప్ రెడ్డి తదితరులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసు స్టేషన్​కు తరలించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత భర్త పదవిని రెండేళ్లు పొడిగించడంపై ఐకాస నాయకులు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే ఉపసంహరించుకోవాలని... లేనిపక్షంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఐకాస నాయకులు హెచ్చరించారు.

ఇవీ చూడండి: ఓయూ భూములపై గవర్నర్​ను కలిసిన కోదండరాం, చాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.