Opposition Parties Election Campaign In Telangana 2023 : శాసనసభ సమరంలో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్.. గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతుండగా.. అటు బీజేపీ సైతం సత్తా చాటేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ప్రచారం సాగిస్తున్నాయి. హైదరాబాద్ ఉప్పల్‌లో బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ ప్రభాకర్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. బతుకమ్మలు, బోనాలతో మహిళలు అమిత్ షాకు స్వాగతం పలికారు. కుటుంబపాలనకు స్వస్తి పలకాలని, అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు.
BJP Election Campaign in Telangana : కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్‌కు మద్దతుగా ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నానగర్‌లో ప్రచారం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రచారంలో భాగంగా పట్టణంలోని క్లాక్ టవర్, హన్వాడ, జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో ప్రసంగించిన ఈటల.. తెలంగాణ ప్రజల కల నెరవేరే పాలన రావాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆయన సతీమణి ఈటల జమున ఇల్లందకుంట మండలంలో ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ పదో డివిజన్‌లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిర్వహించిన రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్.. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుపడతాయన్నారు.
రాష్ట్రానికి 24న మరోసారి ప్రియాంక గాంధీ రాక- మూడు రోజులు, పది సభలు
Nitin Gadkari On Kaleshwaram Project : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభకు ఆ పార్టీ జాతీయ నేత నితన్ గడ్కరీ హాజరయ్యారు. తెలంగాణ ప్రజల మేలు కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చామని.. కానీ, కేసీఆర్ పాలనాతీరుతో నేటి పరిస్థితులు బాధ కల్గిస్తున్నాయన్నారు. నారాయణగూడలోని గాంధీ కుటీర్‌లో ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. సనత్‌నగర్ బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్‌రెడ్డికి మద్దతుగా అమీర్‌పేట్ డివిజన్‌లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచార ర్యాలీ నిర్వహించారు. కుటుంబ పాలనకు అంతం పలికేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
Congress Election Campaign Peddapally :పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో మంథని కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరిస్తూ.. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన ఓట్లు అభ్యర్థించారు. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సారంగాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అర్పపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించిన జీవన్‌రెడ్డి.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.
హలో నేను మీ ఈవీఎంను - నా గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి యాచారం మండలంలో నిర్వహించిన ప్రచార ర్యాలీల్లో ఆ పార్టీ నేత తీన్మార్ మల్లన్న, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని వారు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజయాన్ని కాంక్షిస్తూ.. కాంగ్రెస్, టీడీపీ నేతలు నియోజకవర్గంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో నాగార్జునసాగర్ అభ్యర్థి జైవీర్‌రెడ్డి ప్రచారం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనానికి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఎస్సీలను మోసం చేసిన కేసీఆర్ సర్కార్‌ను గద్దెదించాలని ఆయన పిలుపునిచ్చారు.
Telangana Assembly Elections 2023 : ఖమ్మంలో ముస్లిం మైనార్టీలు నిర్వహించిన సభకు కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌ఘర్ఘీ హాజరయ్యారు. దేశ ఐక్యత కాంగ్రెస్‌తోనే సాధ్యమని.. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మద్దతుగా కేరళ ఎంపీ సురేశ్.. ప్రచారం చేశారు. నిర్మల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుగా మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్.. తానూర్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణలో ఒకే కుటుంబం బాగుపడిందని.. ప్రజల జీవితాల్లో మార్పురాలేదని చవాన్ విమర్శించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్.. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా నియోజకవర్గంలో తమ పార్టీ గెలుస్తుందన్నారు. వేములవాడలో పర్యటించిన సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి.. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో మాలలందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని మాల ప్రజాసంఘ ఐకాస పిలుపునిచ్చింది.
'ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే బాధేస్తోంది - హ్యాట్రిక్ విజయంపై పూర్తి విశ్వాసం ఉంది'