ETV Bharat / state

శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదం - OYC argue in ts assembly

శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదానికి దిగాయి. ఎంఐఎం నేత అక్బరుద్దీన్​, కాంగ్రెస్​ ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి.. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Opposition clashed with the speaker in the legislature
శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదం
author img

By

Published : Sep 9, 2020, 11:18 AM IST

Updated : Sep 9, 2020, 11:35 AM IST

అసెంబ్లీ సమావేశాల్లో కాస్త వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభాపతితో ఎంఐఎం నేత అక్బరుద్దీన్​, కాంగ్రెస్​ ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి వాగ్వాదానికి దిగారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు సభలో మాట్లాడేందుకు 6నిమిషాల సమయం ఏం సరిపోతుందని ఓవైసీ ప్రశ్నించారు. సభ్యుల సంఖ్య ప్రకారమే సమయం ఇస్తామని స్పీకర్​ తెలిపారు.

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే.. దాని పైన చర్చ పెట్టకుండా అనవసర అంశాలపై చర్చ పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తాము ప్రతీ అంశంలో సహకరిస్తున్నా.. రూల్స్ మాట్లాడుతున్నారని ఓవైసీ అన్నారు. సభలో కరోనాపై చర్చ వెంటనే జరపాలని రాజగోపాల్ రెడ్డి, ఓవైసీ కోరారు.

Last Updated : Sep 9, 2020, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.