ETV Bharat / state

గురుకుల విద్యార్థులకు ఆన్​లైన్​లో పాఠాలు - తెలంగాణ తాజా వార్తలు

ఎస్సీ గురుకులాల విద్యార్థులకు ఈనెల 6 నుంచి దూరదర్శన్ యాదగిరి ఛానెల్ ద్వారా ఆన్ లైన్ పాఠాలు బోధించేందుకు ఏర్పాట్లు చేశారు. గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించనున్నట్టు సొసైటీ కార్యదర్శి ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

telangana educational news
గురుకుల విద్యార్థులకు ఆన్​లైన్​లో పాఠాలు
author img

By

Published : Jul 5, 2020, 4:54 AM IST

ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులకు ఆన్​లైన్​ ద్వారా పాఠాలు బోధించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండు గంటల వరకు.. రోజూ 30 నిమిషాల పాటు ఈ ఆన్​లైన్​ పాఠాలు ప్రసారమవుతాయని సొసైటీ కార్యదర్శి ప్రవీణ్​కుమార్​ పేర్కొన్నారు.

ఈనెల 6 నుంచి 18 వరకు డిగ్రీ... 21 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్.. ఆగస్టు 3 నుంచి 11 వరకు పాఠశాల విద్యార్థులకు పాఠాలు ప్రసారమవుతాయని ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గణితం, సైన్స్, కామర్స్, ఎకనామిక్స్, సోషల్ , మ్యూజిక్ వంటి సబిజెక్టుల్లో ఎంపిక చేసిన అంశాలను.. నిపుణులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు బోధిస్తారన్నారు. కరోనా పరిస్థితుల్లో గ్రామాల్లోని పేద విద్యార్థుల చదువులు ఆగిపోకుండా ప్రభుత్వ సహకారంతో ఆన్​లైన్ పాఠాలను బోధిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.