తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం వద్ద ప్రమాదానికి గురైన బోటులో హైదరాబాద్ మాదాపూర్లోని ఓ జిమ్లో శిక్షకులుగా పనిచేస్తున్న నలుగురు యువకులు ఉన్నారు. మాదాపూర్కి చెందిన సాయికుమార్, టోలిచౌకి కి చెందిన మొయిన్గర్, తాలిబ్ పటేల్, మియాపూర్ నివాసి అక్బర్లు నిన్న పాపికొండలు విహారయాత్రకు వెళ్ళారు. ఆకస్మాత్తుగా బోటు ప్రమాదానికి గురవ్వడంతో మోయిన్గర్ క్షేమంగా బయటపడ్డాడు. మిగిలిన వాళ్ళ జాడ ఇంతవరకూ లభ్యం కాకపోవడం వల్ల వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి :బోటు మునిగింది.. పరిమితికి మించిన ప్రయాణికుల వల్లేనా?