దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లకు గడువు రేపటి వరకు పొడగించారు. విద్యార్థుల వినతి మేరకు నేటితో ముగిసిన గడువును మరోరోజు పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.
మొదటి విడతలో సీటు పొందిన విద్యార్థులు రేపటిలోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని అన్నారు. అప్పుడే సీటు రిజర్వ్ అవుతుందని.. లేకపోతే రద్దవుతుందని లింబాద్రి స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు లక్షా 2 వేల 14 మంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటు రిజర్వ్ చేసుకున్నారని వివరించారు. మొదటి విడతలో సీటు రిజర్వ్ చేసుకున్న తర్వాత.. మరింత మెరుగైన సీటు కోసం రెండో విడతలోనూ పాల్గొనవచ్చునని కన్వీనర్ పేర్కొన్నారు. రెండో విడతలలో ఇప్పటి వరకు 37,019 మంది రిజిస్టర్ చేసుకున్నారని.. మొదటి సీటు పొందిన వారితో కలిపి 67,791 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని లింబాద్రి తెలిపారు.
ఇదీ చూడండి : గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకుంటాం: హరీశ్‌రావు