ETV Bharat / state

One Crore Saplings Plantation Telangana : ఒకే రోజు కోటి మొక్కలు.. విద్యార్థులకు ఫ్రీగా 'గాంధీ' చిత్ర ప్రదర్శన - one crore saplings plantation Telangana

One Crore Saplings Plantation Telangana : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12న ఒకేసారి కోటి మొక్కలు నాటేందుకు సర్కార్‌ సిద్ధమైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా మొక్కలు నాటనున్నారు. కార్యక్రమంలో భాగంగా మంచిరేవుల ఫారెస్ట్ పార్కులో సీఎం కేసీఆర్ మొక్కలు నాటనున్నారు.

Independence Day Diamond Jubilee Celebrations in Telangana
Swatantra Bharatha Vajrotsavam 2023
author img

By

Published : Aug 10, 2023, 10:06 AM IST

Updated : Aug 10, 2023, 10:29 AM IST

One Crore Saplings Plantation Telangana 2023 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 12న తెలంగాణ వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వజ్రోత్సవాల ప్రారంభం సమయంలోనూ 2022 ఆగస్టు 21న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక హరితహారం(Haritha Haram) కార్యక్రమం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు అన్నివర్గాల వారిని కార్యక్రమంలో భాగస్వామ్యులను చేసి పల్లె, పట్టణాల్లో విస్తృతంగా మొక్కలు నాటారు. అదే తరహాలో ముగింపు ఉత్సవాల సందర్భంగా కూడా మరోమారు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్​

Independence Day Celebrations Telangana 2023 : అందుకు అనుగుణంగా ఈ నెల 12న ఒకే రోజు కోటి మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. సీఎం కేసీఆర్ చిల్కూర్ రిజర్వ్‌ ఫారెస్ట్ బ్లాక్‌కు చెందిన మంచిరేవుల ప్రాంతంలోని ఫారెస్ట్‌ పార్కులో మొక్కలు నాటే అవకాశం ఉంది.

Swatantra Bharata Vajrotsavalu 2023 : మరోవైపు.. వజ్రోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఈ నెల 14 నుంచి 24 వరకు రాష్ట్రంలోని 582 థియేటర్లలో విద్యార్థులకు 'గాంధీ'(Gandhi Movie) చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలను థియేటర్ల వద్దకు తీసుకొచ్చి.. తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చేలా ఉచిత రవాణా సౌకర్యం కల్పించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ 'గాంధీ' చిత్ర ప్రదర్శనపై బుధవారం సమావేశం నిర్వహించారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. కార్యాచరణ ఖరారు చేయనున్న సీఎం

విద్యార్థులకు ఫ్రీగా గాంధీ చిత్ర ప్రదర్శన..: ఈ సందర్భంగా గాంధీ జీవన శైలి, మానవతా విలువలను నేటి తరానికి తెలిపేందుకు గతేడాది ఆగస్టులో థియేటర్లలో తొలిసారిగా ప్రదర్శించిన గాంధీ చిత్రానికి విశేష స్పందన లభించిందని.. ముగింపు వేడుకల్లోనూ విద్యార్థులకు మరోసారి జాతీయ స్ఫూర్తిని ఇచ్చేందుకు చిత్ర ప్రదర్శన చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ చలన చిత్రాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అనిల్‌ కూర్మాచలం, రాష్ట్ర ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు సునీల్‌ నారంగ్‌, తెలుగు ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనుంది. ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వీరుల స్మారక స్థూపం వద్ద కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల (Independence Day Celebrations 2023) నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి ఇటీవల సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ ఆదేశాలతో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

రాష్ట్రంలో వైభవంగా సాగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

5 వేల మంది మహిళల అవయవదానం.. స్వాతంత్య్ర దినోత్సవం రోజే..

Last Updated : Aug 10, 2023, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.