ETV Bharat / state

తిరుమల మొదటి ఘాట్​రోడ్డులో ఏనుగులు.. భయం గుప్పిట్లో భక్తులు

Elephants in Tirumala: తిరుమలలో భక్తులను ఏనుగులు మరోసారి భయపెట్టాయి. మొదటి కనుమదారి ఏనుగుల ఆర్చ్ వద్ద ఏడు ఏనుగులు సంచరించాయి. గజరాజుల రాకతో.. వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

TIRUMALA ELEPHANTS
TIRUMALA ELEPHANTS
author img

By

Published : Jun 26, 2022, 8:20 PM IST

Tirumala: తిరుమలలో భక్తులను మరోసారి ఏనుగులు ఆందోళనకు గురిచేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు సమీపంలోని ఎలిఫెంట్‌ ఆర్చ్‌ వద్ద అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. ఒక్కసారిగా 7 ఏనుగులు ఘాట్‌రోడ్డు సమీపంలోకి రావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న తితిదే అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి పంపించారు.

గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం పెరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఏనుగుల గుంపు ఘాట్‌ రోడ్డు సమీపంలోకి రావడం వారంలో ఇది రెండోసారి. గుంపులో సుమారు ఏడు ఏనుగులు ఉన్నాయని భక్తులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.