హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రశాంత్‌నగర్‌లో సుంకల మరమ్మ (75), కూతురు మాధవితో కలిసి ఉంటోంది . ఈనెల 13న కురిసిన భారీ వర్షంతో వరదనీరు ఇంట్లోకి వచ్చి చేరింది. ఈ విషయాన్ని స్థానికులు కిస్మత్పూర్లో ఉండే మనుమడు భరత్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ప్రశాంత్నగరకు వచ్చిన భరత్ నానమ్మ మరమ్మ , ఆమె కూతురు మాధవిని తన ఇంటికి తీసుకెళ్లారు.
అప్పటికే తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వరమ్మ ఈనెల 18న సాయంత్రం 4 గంటలకు చనిపోయింది. లంగర్ హౌస్, ప్రశాంత్‌నగర్‌లోని తన ఇంట్లో వరదలో మంచంపై, కుర్చీలో కూర్చున్న మరమ్మ ఫొటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న కార్వాన్ సర్కిల్ డీఎంసీ సువార్త... మరమ్మ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె చిన్న కొడుకు ప్రశాంత్‌నగర్ నాలాలో పడి మృతి చెందాడని స్థానికులు తెలిపారు.
ఇదీ చూడండి: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం