ETV Bharat / state

'కేసీఆర్‌ ఏడడుగులు వేస్తే రాజ్‌భవన్‌ వస్తుంది.. ఆ ఓపిక లేకే సుప్రీంకు' - NVSS Prabhakar Latest News

NVSS Prabhakar on Pending Bills Issue: సీఎం కేసీఆర్​పై ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి ఏడు అడుగులు వేస్తే రాజ్‌భవన్‌ వస్తుందని అన్నారు. సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్​కు వివరణ ఇస్తే బిల్లులు ఆమోదం పొందేవని తెలిపారు. కానీ ఏడు అడుగులు వేసే ఓపిక, తీరిక ముఖ్యమంత్రికి లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.

NVSS Prabhakar
NVSS Prabhakar
author img

By

Published : Mar 3, 2023, 3:52 PM IST

NVSS Prabhakar on Pending Bills Issue: ముఖ్యమంత్రి కేసీఆర్​పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి ఏడు అడుగులు వేసి రాజ్‌భవన్‌కి వెళ్తే.. బిల్లులు ఆమోదం పొందేవని అన్నారు. ఏడు అడుగులు వేసే ఓపిక.. తీరిక సీఎంకు లేకుండా పోయిందని మండిపడ్డారు. రాజకీయం చేయాలనే దురుద్దేశంతో బిల్లులపై సుప్రీం కోర్టుకు వెళ్లారని దుయ్యబట్టారు. హైదరాబాద్​లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మద్యం కుంభకోణానికి రాజకీయ రంగు పులిమి సానుభూతి పొందాలని: గ్యాస్ ధరలు పెంచారని సిలిండర్లతో మంత్రులు ఆందోళనలు చేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, నీటి బిల్లులు పెంచినా వాడకుండా మంత్రులుంటారా అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు చెబితేనే అరెస్టు చేస్తారంటా.. ఇక విచారణ సంస్థలు ఎందుకని కేసీఆర్ కుమార్తె కవిత మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కవిత మద్యం కుంభకోణంలో పెట్టుబడిదారీ, మధ్యవర్తి అని దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోందని అన్నారు. మద్యం కుంభకోణానికి రాజకీయ రంగు పులిమి సానుభూతి పొందాలని కవిత చూస్తున్నారనీ ప్రభాకర్‌ ఆరోపించారు.

మహిళా సాధికారత గురించి మాట్లాడటం సిగ్గు చేటు: సొంత పార్టీలో మహిళా ప్రజా ప్రతినిధులు కన్నీరు పెట్టుకుంటే పట్టించుకోని కవిత.. మహిళా సాధికారత గురించి మాట్లాడటం సిగ్గు చేటని ఎన్వీఎస్​ఎస్​​ ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, అవమానాలు జరిగినా.. గవర్నర్​పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కవిత స్పందించలేదని గుర్తుచేశారు. కానీ కవిత మాత్రం మహిళల కోసం జంతర్​ మంతర్ వద్ద ధర్నా చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎన్వీఎస్ఎస్​​ ప్రభాకర్ అన్నారు.

"ప్రగతిభవన్ నుంచి ముఖ్యమంత్రి ఏడు అడుగులు వేస్తే రాజ్‌భవన్‌ వస్తుంది. గవర్నర్​ను కలిసి వివరాలు తెలియజేస్తే బిల్లులు ఆమోదం పొందేవి. ఏడు అడుగులు వేసే ఓపిక, తీరిక సీఎంకు లేకుండా పోయింది. సంప్రదాయానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. రాజకీయం చేసేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది." - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

కేసీఆర్‌ రాజ్‌భవన్‌కి వెళ్లి వివరణ ఇస్తే బిల్లులు ఆమోదం పొందేవి: ప్రభాకర్‌

గవర్నర్ స్పందన.. పెండింగ్​ బిల్లుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ స్పందించారు. రాజ్​భవన్​.. దిల్లీ కంటే దగ్గరగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశించి ట్వీట్​ చేశారు. ఇందులో భాగంగానే సీఎస్​గా శాంతికుమారి బాధ్యతలు తీసుకున్నాక రాజ్​భవన్​కు రావడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ప్రొటోకాల్​ లేదు, అధికారికంగా రాలేదని పేర్కొన్నారు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సీఎస్​ కలవలేదని అన్నారు​. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెల్లడించారు.

ఇవీ చదవండి: పెండింగ్​ బిల్లుల వివాదం.. స్పందించిన గవర్నర్​.. ఏమన్నారంటే..?

మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకురావాలి: కవిత

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. వైద్యుల కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.