ETV Bharat / state

నేటి నుంచి కేసీఆర్‌ పౌష్టికాహార కిట్ల పంపిణీ - Nutrition Kits distribution from today

nutrition kits distribution from today : గర్భిణీల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు సర్కారు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్​లను పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. సుమారు 50 కోట్లతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.25 లక్షల మంది గర్భిణీలకు లబ్ది చేకూరనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా జిల్లాలకు న్యూట్రిషన్ కిట్​లను పంపిన సర్కారు.. నేడు స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో గర్భిణీలకు కిట్ లను అందించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది.

KCR Nutrition Kits
కేసీఆర్ పౌస్టికాహార కిట్లు
author img

By

Published : Dec 21, 2022, 7:19 AM IST

nutrition kits distribution from today : గర్భిణీల పాలిట రక్తహీనత శాపంగా మారుతున్న వేళ తెలంగాణ సర్కారు.. గర్బిణీల ఆరోగ్యం కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మాతా శిశు సంరక్షణలో భాగంగా తీసుకువచ్చిన కేసీఆర్ కిట్ ఇచ్చిన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని.. గర్భిణీల్లో రక్తహీనత నియంత్రణ కోసం తాజాగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా రక్తహీనత నమోదవుతున్న తొమ్మిది జిల్లాలను ఎంపిక చేసి ఈ రోజు నుంచి ఆయా జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్​ల పంపిణీకి చేయనుంది.

ఈ మేరకు ఉప్పటికే కిట్ లను జిల్లాలకు పంపిణీ చేసింది. సుమారు 50 కోట్ల రూపాయలను వెచ్చించి సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.25 లక్షల మంది గర్భిణీలకు లబ్ది చేకూరనుంది. రక్తహీనత ఎక్కువగా నమోదవుతున్న ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల్‌, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్ ల‌లో బుధవారం కిట్ల పంపిణీ చేపట్టనుంది. ఆయా జిల్లాల్లో స్థానిక మంత్రులు, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కిట్ ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.

ఇక కామారెడ్డి కలెక్టరేట్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వర్చువల్ గా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గర్భిణీల కోసం రూపొందించిన ఒక్కో కిట్ విలువల 1962 రూపాయలు కాగా... ఒక్కో కిట్ లో ఒక కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, ఒక కేజీ ఖర్జూర, 3 ఐరన్ సిరప్ బాటిళ్లు, 500 గ్రాముల నెయ్యి, ఆల్‌బెండ‌జోల్ టాబ్లెట్‌, ఒక కప్పుని ప్లాస్టిక్ బాస్కెట్ లో పెట్టి అందించనున్నారు.

ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ ల‌ను పోష‌కాహారం ద్వారా అందించి ర‌క్త హీన‌త త‌గ్గించ‌డం, హీమోగ్లోబిన్ శాతం పెంచ‌డం న్యూట్రీషన్‌ కిట్ల లక్ష్యం. గర్భిణీలకు 13నుంచి 27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో ఒకసారి, 28 నుంచి 34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో రెండో సారి ఈ కిట్లను అందించనున్నారు. ప్రాథమికంగా ఎంపిక చేసిన 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం ఈ కిట్ లను అందుబాటులో ఉంచనుంది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో మాతృమరణాల రేటు 92గా ఉండగా ప్రస్తుతం 43కి తగ్గింది.

మాతృమరణాల రేటుతగ్గించటంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలించింది. ఇదే స్ఫూర్తితో గర్భిణీల్లో రక్తహీనత మాతృమరణాలకు దారి తీస్తుందని బిడ్డ ఆరోగ్యానికి సైతం ఇది ప్రమాదకరంగా మారుతోందని గుర్తించిన సర్కారు... ఈ మేరకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లను అందించాలని నిర్ణయించింది. ప్రాథమికంగా 9 జిల్లాల్లోనే కిట్ ల పంపిణీ చేపట్టినప్పిటికీ భవిష్యత్తులో అన్ని జిల్లాలకు కార్యక్రమాన్ని విస్తరించనుంది. దేశంలో మరెక్కడా లేన విధంగా కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టి విజయం సాధించిన సర్కారు మరోమారు న్యూట్రిషన్ కిట్ ద్వారా గర్భిణీలకు అండగా నిలవనున్నట్టు ప్రకటించంది. ఫలితంగా మాతా శిశు సంరక్షణకు మరింత కృషి చేస్తున్నామని స్ఫష్టం చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.