ETV Bharat / state

'నుమాయిష్' ప్రారంభం.. కొలువుదీరిన 2 వేలకు పైగా స్టాళ్లు

Numaish Exhibition 2023 Started : నూతన సంవత్సరం ప్రారంభం వేళ హైదరాబాద్‌ వాసులను అలరించేందుకు నుమాయిష్‌ ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు ఈ నుమాయిష్​ను ప్రారంభించారు. నేటి నుంచి నెలన్నర పాటు ఈ ఎగ్జిబిషన్​ నిర్వహించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులతో 2,000పైగా స్టాళ్లు నుమాయిష్‌లో కొలువుదీరాయి.

numayus
నుమాయిష్​
author img

By

Published : Jan 1, 2023, 5:52 PM IST

Updated : Jan 1, 2023, 6:40 PM IST

Numaish Exhibition 2023 Started : రాష్ట్ర మంత్రులు హైదరాబాద్ నాంపల్లిలో మినీ భారత్‌గా పేరొందిన 82వ నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. నుమాయిష్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందని.. ఎంతో మంది వ్యాపారులను పారిశ్రామికవేత్తలను ఆకర్షించే శక్తి నుమాయిష్‌ సమ్మేళనానికి ఉందని నుమాయిష్ గౌరవాధ్యక్షులు మంత్రి హరీశ్​రావు అన్నారు.హరీశ్​రావుతోపాటు మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, వేముల ప్రశాంత్​రెడ్డి నుమాయిష్‌ను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన రైలుబండిలో కలియ తిరుగుతూ స్టాళ్లను సందర్శించి.. వివిధ రాష్ట్రాల ఉత్పత్తులను పరిశీలించారు.

ఎంతో చరిత్ర కలిగిన ఈ నుమాయిష్‌ ప్రపంచంలో జరిగే వ్యాపార సమ్మేళనాల్లో ఇదొకటని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రత్యేకంగా మహిళా విద్యను ప్రోత్సహించేందుకు విద్యాసంస్థలు నడుపుతూ మహిళా సాధికారతకు తోడ్పాటునందిస్తున్నారని వివరించారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచే నడుపుతున్న నుమాయిష్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌తో వచ్చిన ఆదాయంతో రాష్ట్రంలో పలు పాఠశాలలు, విద్యా సంస్థలు నడపడం గొప్ప విషయంగా తలసాని పేర్కొన్నారు.

కొలువుదీరిన 2,400 స్టాళ్లు: ఎగ్జిబిషన్‌లో తెలుగు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మూ కశ్మీర్, పశ్చిమ బంగాల్‌, ఇతర రాష్ట్రాలకు చెందిన 2,400 స్టాళ్లు కొలువుదీరాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఎగ్జిబిషన్‌ ప్రవేశ రుసుం రూ.40గా నిర్ణయించారు. నుమాయిష్‌కు వచ్చే వారి కోసం ఉచిత పార్కింగ్ సౌకర్యం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

ప్రత్యేక జాగ్రత్తలు: వేలాది స్టాళ్లు, లక్షలాది సందర్శకులతో కిటకిటలాడే నుమాయిష్‌లో గతంలో మాదిరిగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ అగ్నిమాపక సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ప్రదర్శనకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు సౌకర్యాలు కల్పించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 1, 2023, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.