ETV Bharat / state

లోకేశ్​కు మద్దతుగా ఖతార్​లో అభిమానుల భారీ ర్యాలీ - Nara Lokesh

Qatar TDP fans rally to support to Yuvagalam: నారా లోకేశ్​ తలపెట్టిన యువగళం పాదయాత్రకు ప్రజలు నుంచి మంచి స్పందన వస్తోంది. కుప్పంలో ఈరోజు జనసంద్రం సముద్ర కెరటం వలే ఎగసిపడగా.. మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా లోకేశ్​కు మద్దతుగా అభిమానులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఖతార్​లో అభిమానులు అక్కడ యువగళానికి మద్దతూగా పాదయాత్ర చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.

Qatar fans rally to support to Yuvagalam

author img

By

Published : Jan 27, 2023, 10:56 PM IST

TDP fans rally in Qatar to support to Yuvagalam: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ "యువగళం" పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా ఖతార్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఖతార్​లో వర్షాన్ని కూడా లెక్కచేయకుండా సభ్యులందరూ పాదయాత్రకు హాజరయ్యారు. "జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేశ్​, జై యువగళం" అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్ర కొనసాగించారు.

లోకేశ్​కు మద్దతుగా ఖతార్​లో అభిమానులు పాదయాత్ర

ఈ కార్యక్రమానికి గొట్టిపాటి రమణతో పాటుగా ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్, మలిరెడ్డి సత్యనారాయణ, విక్రమ్ సుఖవాసి, గోవర్ధన్, రమేష్, కిరణ్, వాసు, రవికిశోర్, సతీష్ బాబు, శబరీష్, సాయి రమేష్, వెంకప్ప, సతీష్, ఫణి పలువురు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, పని తీరును, ప్రజల పట్ల వ్యవహరిస్తున్నవిధానాలను ఎండగడుతూ నిర్వహిస్తున్న లోకేశ్​ పాదయాత్ర తెలుగు దేశం పార్టీకు, పార్టీ శ్రేణులకు మరింత మనోబలం ఇస్తుందని.. తప్పక విజయవంతం అవుతుందని వారు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.