ETV Bharat / state

జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్ జారీ

Lands In Districts
Lands In Districts
author img

By

Published : Feb 11, 2022, 8:59 AM IST

Updated : Feb 11, 2022, 9:27 AM IST

08:55 February 11

హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ద్వారా జిల్లాల్లో భూముల విక్రయం

Notification for Land Sales: నిధుల సమీకరణ కోసం హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో భూముల అమ్మకాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా జిల్లాల్లోనూ భూములను విక్రయించనుంది. ఈ మేరకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. మహబూబ్​నగర్, నల్గొండ, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్లాట్లను విక్రయించనుంది. కనిష్ఠంగా 60 చదరపు గజాల నుంచి గరిష్ఠంగా 6,500 చదరపు గజాల వరకు స్థలాలు ఉన్నాయి.

చదరపు గజానికి కనీస ధర రూ.5వేలు ఉండగా... గరిష్ఠంగా రూ.40వేలు ఉంది. హెచ్​ఎండీఏ, టీఎస్​ఐఐసీ ద్వారా భూములను విక్రయిస్తారు. ఈ నెల 18, మార్చి 7వ తేదీన ప్రీబిడ్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. మార్చి 14, 15, 16, 17 తేదీల్లో భూముల అమ్మకం కోసం వేలం నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి : CM KCR JANGAON TOUR: నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన

Last Updated : Feb 11, 2022, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.