ETV Bharat / state

మహిళా, శిశు సంక్షేమ శాఖలో 181 పోస్టులకు నోటిఫికేషన్ - Child Welfare Department jobs news

మహిళా, శిశు సంక్షేమ శాఖలో 181 పోస్టులకు నోటిఫికేషన్

author img

By

Published : Aug 27, 2022, 6:03 PM IST

Updated : Aug 27, 2022, 6:57 PM IST

18:00 August 27

మహిళా, శిశు సంక్షేమశాఖలో 181 పోస్టులకు నోటిఫికేషన్

tspsc notification: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. మహిళ, శిశు సంక్షేమ శాఖలో 181 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. మహిళ, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ సూపర్​వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబరు 8 నుంచి 29 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్​పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాలు www.tspsc.gov.in లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

నోటిఫికేషన్ల జారీపై మంత్రి అసంతృప్తి..: శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 80వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ పురోగతిని మంత్రి హరీశ్​రావు శుక్రవారం తెలుసుకున్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియపై బీఆర్కే భవన్​లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, టీఎస్పీఎస్సీ, పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు సహా నియామక సంస్థల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 50 వేల వరకు ఉద్యోగాల నియామకాలకు అనుమతి ఇచ్చినట్లు ఆర్థికశాఖ అధికారులు తెలపగా.. అందులో సగం కూడా నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా నియామక సంస్థల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ 3, గ్రూప్ 4, ఇంజినీర్ల నియామకం, గురుకులాలు సహా ఇతర నోటిఫికేషన్ల విషయంలో ఆలస్యం చేయవద్దని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని, సర్వీసు నిబంధనలు సహా ఇతర అంశాలకు సంబంధించి ఏవైనా సవరణలు అవసరమైతే చేయాలని మంత్రి చెప్పారు. ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి జోన్లు, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా పూర్తి వివరాలు వీలైనంత త్వరగా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన అధికారులు మరో 181 ఉద్యోగాలకు నేడు నోటిఫికేషన్ జారీ చేశారు.

ఇవీ చూడండి..

నోటిఫికేషన్ల జాప్యంపై హరీశ్​ రావు అసంతృప్తి

దుమ్మురేపిన వందే భారత్‌, ట్రయల్‌ రన్‌లో గంటకు 180 కిమీ వేగం

Last Updated : Aug 27, 2022, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.