2000 jobs in Telangana Welfare Gurukuls : తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య పెరగనుంది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో మరో 2 వేలకుపైగా పోస్టుల్ని సంబంధించిన సొసైటీలు గుర్తించాయి. త్వరలోనే జారీ చేయనున్న గురుకుల నియామక ప్రకటనల్లో భాగంగా వాటిని నింపేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాయి. ప్రస్తుతం గురుకులాల్లో భర్తీకి 11వేల 12 పోస్టులకు అనుమతులు లభించాయి. తాజా పోస్టులతో 13 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కొత్తగా మంజూరయ్యే ఎస్సీ, ఎస్టీ గురుకులాల పోస్టులు వీటితో పాటు భర్తీ చేయనున్నారు.
సంక్షేమ గురుకులాల్లో మొదటగా రాష్ట్ర ప్రభుత్వం 9096 ఉద్యోగాలను ప్రకటన చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి బీసీ సొసైటీ పరిధిలో నూతనంగా 33 బీసీ గురుకుల స్కూల్స్, 15 బీసీ డిగ్రీ కళాశాలలు ప్రారంభించారు. వాటికి సంబంధించిన బీసీ సంక్షేమ శాఖ గవర్నమెంట్‌కి ప్రతిపాదనలు పంపించింది. దీంతో జనవరిలో బీసీ గురుకుల సొసైటీలో 2591 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది.
బీసీ పోస్టులు విషయం అయ్యాక గురుకుల నియామక ప్రకటన ఇచ్చేలా బోర్డు భావించింది. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 2 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు సొసైటీలు గుర్తించాయి. ఈ పోస్టులు భర్తీకి సరైన సమయంలో ప్రతిపాదనలు సిద్ధం అవ్వలేదు. బీసీ గురుకులాల్లో అదనంగా పోస్టులకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తరవాత ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోనూ అదనపు ఉద్యోగాలకు అనుమతులు ఇవ్వాలని సొసైటీలు ప్రభుత్వానికి వెల్లడించాయి. వీటికి త్వరలోనే అనుమతులు లభించే అవకాశాలున్నట్లు సొసైటీ వర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో గురుకులాల బోధన పోస్టుల భర్తీ నిలిచిపోయింది. కోడ్ ముగిసే సమయానికి ఈ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాలకు అనుమతులు వస్తే అన్నింటిని కలిపి ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవీ చదవండి: