ETV Bharat / state

పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్న ఆర్టీసీ

ముందుచూపు లేకపోవడం.. తొందరపాటు నిర్ణయాలు.. నిర్వహణా లోపాలు.. సంస్థను నష్టాల పాలు చేస్తాయనేందుకు ఆర్టీసీ సరిగ్గా సరిపోతోంది. కొండనాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా మారింది పరిస్థితి.. మినీ బస్సులతో.. మనీ పట్టేద్దామనుకుంటే.. కరోనా దెబ్బకు వాహనాలు పూర్తిగా మూలకుపడిపోయి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారైంది.

no use with vazra buses to tsrtc
పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్న ఆర్టీసీ
author img

By

Published : Apr 21, 2021, 6:55 PM IST

Updated : Apr 21, 2021, 7:09 PM IST

పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్న ఆర్టీసీ

నష్టాల్లోని సంస్థను గట్టెక్కించేందుకు ఆర్టీసీ అనేక మార్గాలను అన్వేషించింది. అందులో భాగంగా కార్గో సేవలను విస్తృతం చేసింది. డొక్కు బస్సుల స్థానంలో అద్దెబస్సులను దింపింది. ఎంతచేసినా ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకోలేకపోయింది. వీటన్నింటికి తోడు కరోనా వైరస్‌ ప్రజారవాణాపై తీవ్ర ప్రభావం చూపింది. కొవిడ్‌ కొంతమేరకు అదుపులోకి రావడం.. డీజిల్‌ ధరలు భగ్గుమనడం వల్ల జనం మెల్లగా ఆర్టీసీ వైపు మళ్లారు. మెల్లగా కోలుకుంటుందని.. అన్ని బస్సులు రోడ్డెక్కించవచ్చని భావిస్తున్న సంస్థకు కరోనా సెకండ్‌ వేవ్‌ మరోసారి గడ్డుకాలాన్నే మోసుకొచ్చింది. సుడిగుండంలోంచి బయటపడే మార్గాలు మరింత కూరుకుపోయేలా చేస్తున్నాయి. ప్రయాణీకుల సామర్థ్యం పెంచుకునేందుకు ప్రవేశపెట్టిన వజ్ర బస్సుల పరిస్థితి చివరకు తుక్కుగా మారేలా తయారైంది.

ఛార్జీలు ఎక్కువగా ఉండడంతో..

ఆర్టీసీ తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వజ్ర మినీ బస్సులను కొనుగోలు చేసింది. 2017లో 21 సీట్ల సామర్థ్యం ఉన్నవి సమకూర్చుకుంది. మినీ బస్సుల్లో సీట్లు అనువుగా లేవని ప్రయాణీకులు అసంతృప్తి వెలిబుచ్చారు. సీటు సీటుకు మధ్య ఖాళీ స్థలం తక్కువగా ఉండి ఇరుకుగా భావించారు. ఆ తర్వాత 18 సీట్ల వజ్ర మినీ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకుంది. ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్ విధానం, సీసీ కెమెరాలు, వాయిస్ సిస్టం, అగ్ని ప్రమాద నివారణ చర్యలు తదితర సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంది. హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు సర్వీసులు నడిపించారు. ప్రయాణీకులను ఇంటి వద్ద నుంచే తీసుకెళ్లడం.. అక్కడే దింపడం వంటి సేవలు అందించింది. అయినా ఈ ప్రయోగమూ వికటించింది. సుమారు వంద బస్సులు సరిగ్గా రెండున్నరేళ్లు తిరగకుండానే డిపోలకే పరిమితమయ్యాయి. ఏసీ బస్సుల కంటే ఛార్జీలు ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు ఆదరించలేదు.

తలలు పట్టుకుంటున్నారు..

ఏడాదిన్నర కాలంగా వజ్ర బస్సులు డిపోలకు పరిమితమై ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నాయి. అధికారులు వీటిని అమ్మేద్దామనే ఆలోచన చేసి టెండర్లను పిలిచారు. అనుకున్న ధర పలకకపోవడంతో వెనక్కి తగ్గారు. మినీ కార్గో బస్సులుగా మార్చాలని అనుకున్నా ఖర్చుతో కూడుకున్న పనితోపాటు.. తిరిగి అమ్మితే కొనేవారు ఉండరని అధికారులు భావించారు. ఐటీ కార్యాలయాలకు వజ్ర బస్సులను అద్దెకు ఇవ్వాలనుకున్నా.. వర్క్ ఫ్రం హోం వల్ల అలాంటి అవసరమే లేకుండా పోయింది. చివరకు తుక్కుగా మారుద్దామంటే భారీగా నష్టమొస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

సరైన విధంగా వినియోగించాలి..

మెట్రో రైలుకు కనెక్టివిటీగా వజ్ర బస్సులను నడపాలనే ఆలోచన ఉన్నా...అదీ కార్యరూపం దాల్చలేదు. ఏదేమైనా కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన బస్సులను సరైన విధంగా వినియోగించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 600 మంది ఎస్బీఐ ఉద్యోగులకు కరోనా

Last Updated : Apr 21, 2021, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.