ETV Bharat / state

ఇక ఎమ్మెల్సీ లేనట్లేనా!

తెలంగాణ కాంగ్రెస్​కు కొత్త కష్టం వచ్చిపడింది. ఎమ్మెల్యే కోటాలో ఓ ఎమ్మెల్సీ స్థానం గెలవాలన్న ఆశలకు గండిపడింది. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వీడగా తగినంత బలం లేక రాష్ట్ర నాయకత్వానికి దిక్కుతోచడం లేదు.

నిరాశలో హస్తం నేతలు
author img

By

Published : Mar 5, 2019, 4:52 PM IST

Updated : Mar 5, 2019, 5:35 PM IST

నిరాశలో హస్తం నేతలు
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల సమయందగ్గర పడేకొద్ది రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇద్దరు గిరిజన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నట్లు ప్రకటించడం... అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలకు దారి తీస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లు కాంగ్రెస్ సీనియర్‌ నేతలు విశ్లేషిస్తున్నారు.
undefined

ఒక్కరితోనే బరిలోకి..
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపైరాష్ట్ర రాజకీయాల్లో రచ్చ జరుగుతోంది. ఇద్దరు కాంగ్రెస్ నేతలు పార్టీ వీడటం వల్ల కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీల బలాబలాలను పరిశీలించినట్లయితే... ప్రజలు ఎన్నుకున్న 119 ఎమ్మెల్యేలతో పాటు ఆంగ్లో ఇండియన్‌ శాసన సభ్యుడు స్టీఫెన్‌సన్‌తో కలిపి 120 మంది శాసన సభ్యులు ఉన్నారు. ఈ సంఖ్య ఆధారంగా ఎమ్మెల్యే కోటా కింద అయిదుగురు ఎమ్మెల్సీల ఎన్నికకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. అధికార పార్టీ ఎంఐఎంతో కలిసి ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ ఒకరిని బరిలోకి దింపింది. మొత్తం ఆరుగురు పోటీలో నిలవగా... ఈ నెల 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.

'చేయి'కి ఆప్తులేరి...?

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అంచనా వేసినట్లయితే కాంగ్రెస్‌ పార్టీకి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం దాదాపు లేనట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీకి 91 మంది, మిత్రపక్షమైన ఎంఐఎంకు ఏడుగురు కలుపుకొని 98 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఆత్రం సక్కు, రేగా కాంతారావు, తెదేపా నుంచి సండ్ర వెంకటవీరయ్య అధికార పార్టీకి మద్దతు ప్రకటించడంతో... మొత్తం బలం 101కి చేరుకుంది. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు. కాంగ్రెస్‌ సభ్యులు 19 మంది కాగా... ఇప్పుడు 17 మంది మాత్రమే మిగిలారు. తెదేపా నుంచి సండ్ర పోగా.. మెచ్చా నాగేశ్వరరావు మాత్రమే మిగిలారు. మొత్తం హస్తానికి 18 మంది మద్దతుంటుంది.

undefined

కేవలం 18 ఓట్లే..
ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే... 101 మంది సభ్యుల బలం కలిగిన అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల్లో ఒకరికి 21 మంది ఓటు వేసినా, మిగిలిన నలుగురికి 20 లెక్కన ఓట్లు వేసేందుకు అవకాశం ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థికి పడే ఓట్లు కేవలం 18 మాత్రమే. ఆ లెక్కన మొదటి రౌండ్​లోనే తెరాసలో ఒకరు గెలిచే అవకాశం ఉంటుంది. తర్వాత రెండో ప్రాధాన్యతా ఓట్ల బదిలీకి అవకాశం ఉంటే చేపడతారు. గెలిచేందుకు సరిపడా ఓట్లు మిగిలిన అభ్యర్థులకు లేని పక్షంలో తక్కువ ఓట్లున్న వారి తొలగింపు ప్రక్రియను చేపడతారు. ఈ ప్రకారం బలం తక్కువగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించి మిగతా వారిని విజేతలుగా ప్రకటిస్తారు.

నిరాశలో నేతలు..
అయిదుగురు ఎమ్మెల్సీలను అధికార పార్టీ దక్కించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్​కు ఏవిధంగానూ ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం లేదని స్పష్టమవుతుండడంతో పార్టీ నేతల్లో నిరాశ మొదలైంది.

Intro:TG_KRN_09_04_DCP_MRUTHI_AV_C5

కరీంనగర్ కమిషనరేట్లో అదనపు డీసీపీ లా అండ్ ఆర్డర్ గా పనిచేస్తున్న పి సంజీవ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు కరీంనగర్ కమిషనరేట్లో గత రెండు సంవత్సరాల క్రితం ఆయన డిసిపిగా బాధ్యతలు చేపట్టారు సంజయ్ కుమార్ గత కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధులు మధుమేహం రక్తపోటు హృదయ సంబంధిత వ్యాధులు కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధ పడుతున్నారు సోమవారం ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడడంతో కరీం నగర్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సంజీవ్ కుమార్ కు గత మూడు సంవత్సరాల క్రితం గుండె శస్త్రచికిత్స జరిగింది చికిత్స పొందుతూ ఈ రోజు రాత్రి 9 గంటలకు మృతి చెందారు

Body:ర్

Conclusion:గ్
Last Updated : Mar 5, 2019, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.