ETV Bharat / state

'లాక్​ డౌన్.. నగరంలో పేదల కడుపులు మాడ్చేస్తోంది' - ఆకలి తీర్చుకునేందుకు దాతలపై ఆధారం

లాక్‌డౌన్‌ అమలుతో హైదరాబాద్‌ మహానగరంలో.. ఏ దిక్కు లేని వారికి దాతలే దిక్కవుతున్నారు. నగరంలో దాతలెవరైనా ఆపన్న హస్తం అందిస్తేనే వారి ఆకలి తీరుతోంది..లేకుంటే కాలే కడుపుతోనే ఉండాల్సి వస్తోంది. చేయడానికి పనులు లేక.. తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

No food for poor daily wage earners
లాక్‌డౌన్‌ అమలుతో హైదరాబాద్​లో పేదల పరిస్థితి
author img

By

Published : May 24, 2021, 2:06 PM IST

రాష్ట్రంలో విధించిన లాక్​ డౌన్ పేదల పాలిట శాపంగా మారింది. జానెడు పొట్టను నింపుకోలేని పరిస్థితిని తెచ్చింది. కొవిడ్‌ వైరస్​ను నిలువరించేందుకు అమలు చేస్తున్న లాక్‌ డౌన్‌ పేదలకు, దిక్కూ, మొక్కూ లేని వారి కడుపులను మాడ్చేస్తోంది. పూర్తిగా వ్యవస్థలన్నీ స్తంభించడంతో హైదరాబాద్​లో చేయడానికి పనులు లేక.. తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు.

జానెడు పొట్ట చేతపట్టుకుని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి హైదరాబాద్​కు వచ్చిన పేదలు లాక్‌డౌన్‌తో వీధిన పడ్డారు. ఆహారం కొనడానికి డబ్బులు లేక ఆపన్న హస్తం అందించే వారి కోసం ఎదురు చూస్తున్నారు. పార్కులు, పాదబాటలు, బస్సు షెల్టర్లు, మెట్రో స్టేషన్లే వారికి ఆవాసాలుగా మారాయి.

దాతలు అందిస్తేనే పూట గడిచేది

నగరంలో.. ఏ రోడ్డు చూసినా అనాధలతో దర్శనమిస్తుంది. వారంతా వివిధ రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన వారు. లాక్‌డౌన్‌ విధించడంతో ఏమి చేయాలో వారికి దిక్కు తోచడం లేదు. రోజంతా కష్టపడి పని చేస్తేకాని అయిదేళ్లు నోట్లోకి వెళ్లని దుస్థితి వారిది. కూలి పనులు చేసుకుంటేనే.. పూటగడిచే పరిస్థితులు. పనులే లేక అద్దె కట్టకపోతే వెళ్లగొడుతున్నారు ఇంటి యజమానులు. పేదలు ముళ్లెమూటతో వీధిన పడుతున్నారు. ఒకటికి నాలుగు సార్లు కొసిరి కొసిరి పిల్లలకు తినిపించాల్సిన తల్లులు.. దాతలు ఆపన్నహస్తం అందించినప్పుడే చిన్నారులకు సైతం తిండి దొరుకుతోంది.

బస్టాండ్​లే ఆవాసాలు

నగరంలో ఉండేందుకు ఇళ్లులేని పేదలు.. ఎండకు, వానకు తలదాచుకోడానికి బస్సు స్టాపులు, మెట్రో స్టేషన్లను ఆవాసాలుగా ఎంచుకుంటున్నారు. లాక్‌డౌన్‌ అమలైనప్పటి నుంచి కొందరు దాతలు మధ్యాహ్నం పూట భోజనాలను నగర వీధుల్లో ఉంటున్నవారికి అందచేస్తున్నారు. దాతలు ఎంచుకున్న కొన్ని ప్రాంతాల్లోనే భోజనాలు పంపిణీ చేస్తుండడంతో.. మరికొందరు ఆకలితో అలమటిస్తున్నారు. ఆ సమయంలో కొందరు.. దొరికితే రాత్రికి కూడా సేకరించుకుని దాచుకుంటున్నారు. అందని వారికి రాత్రిపూట పస్తులుండాల్సి వస్తోంది.

హైదరాబాద్‌ నగరంలో.. ఏ దిక్కుమొక్కూ లేని వారిని ఒకచోటకు చేర్చి.. భోజనాలైనా అందించేట్లు ప్రభుత్వం చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క పూట కడుపునిండా వారికి భోజనం అందిస్తే లాక్​ డౌన్​లో ఆకలి తీర్చినట్లేనని పలువురు కోరుతున్నారు.

ఇదీ చూడండి: పల్లె బతుకులు ఆగం.. కరోనా పరీక్షలు చేయక వేగంగా వ్యాప్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.