ARVIND COMMENTS ON CM KCR: తెలంగాణ ప్రథమ పౌరురాలైన గవర్నర్‌ను కేసీఆర్ చిన్నచూపు చూపిస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆక్షేపించారు. తెరాస అధికారంలోకి వచ్చిన తొలిసారి మంత్రివర్గంలో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆరునెలల పాటు మంత్రివర్గ విస్తరణ చేయలేదని పేర్కొన్నారు. బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి బడ్జెట్ సమావేశాల ముందే క్యాబినెట్‌ను విస్తరించారని తెలిపారు.
చట్ట సభల నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఆర్టికల్ 176 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకావాలని గుర్తు చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నారు.
ప్రకాశ్ రాజ్, కేసీఆర్ దోస్తానా చూస్తుంటేనే వాళ్ల ఉద్దేశం అర్థమవుతోంది. దేశం ముక్కలు కావాలే అన్న భావజాలం ఉన్న జిగ్నేష్ మేవానీ బృందాన్ని ముందు నుంచి ప్రకాశ్ రాజ్ సమర్ధిస్తున్నాడు. సీఎం కేసీఆర్‌కు భారతదేశం ఐక్యంగా కాకుండా చిన్న చిన్న రాజ్యాలుగా మారాలని కోరుకుంటున్నారు. అందుకే ఇద్దరు కలిసి దేశమంతా తిరిగి ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశాలు పెడుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ను గుర్తించనప్పుడు, ఆయన సీఎం సీటులో ఒక్క నిమిషం కూర్చునే అర్హత లేదు.
- భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఇదీ చదవండి: Bandi sanjay letter to KCR: 'కౌలు రైతుల పట్ల తెరాస ప్రభుత్వం వివక్ష చూపుతోంది'