హైదరాబాద్ నిఫ్ట్ సరికొత్త వస్తు ప్రదర్శనకు వేదికైంది. నగరంలోని దాదాపు 25 కళాశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ఉపకరణాలతో ప్రదర్శన జరుగుతోంది. సరికొత్త డిజైన్లతో రూపొందించిన యాక్సెసరీస్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
స్పెక్ట్రమ్-2020 వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా నిర్వహిస్తోన్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. కళాశాల విద్యార్థులు తమ నృత్యాలతో ప్రదర్శనకు వచ్చిన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.
స్పెక్ట్రమ్-2020 కోసం నెల రోజులుగా సిద్ధమవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇందులో కేవలం నిఫ్ట్ విద్యార్థులే కాకుండా ఇతర కళాశాలకు చెందిన విద్యార్థులూ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. అన్ని కళాశాల విద్యార్థులతో కలిసి తమ ఆలోచనలు పంచుకోవడం సంతోషాన్నిస్తోందని నిఫ్ట్ విద్యార్థులు చెబుతున్నారు. స్పెక్ట్రమ్ ప్రదర్శనలో విద్యార్థులే గాక సాధారణ ప్రజలు కూడా పాల్గొనవచ్చని నిఫ్ట్ అధికారులు చెబుతున్నారు.
ఇవీచూడండి: 'అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలి'