ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని లోనా సెంటర్లలో ఓ ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన నలుగురు యువకులు... గత ఏడాదిగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరి ఇంటిపై... స్ధానిక అరుణ్ బ్రదర్ ఫోర్స్ సాయంతో తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులకు నగదు బదిలీ జరిగినట్లు సమాచారం. ఈ ఇంటి వద్దకు స్థానిక పోలీసులను ఎన్‌ఐఏ అనుమతించలేదు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విరసం నాయకుడు కళ్యాణరావు, మావోయిస్ట్ ఆర్కే భార్య శిరీష ఇంట్లో వేకువజాము నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీస్ బలగాలతో వీరి ఇళ్లను చుట్టుముట్టారు. స్థానికులను గానీ, మీడియా ప్రతినిధులను పరిసరాల్లోని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉండవచ్చనే అనుమానాలతో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.