ETV Bharat / state

పీఎఫ్‌ఐ కేసులో హైదరాబాద్​, కరీంనగర్​లో మరోసారి ఎన్ఐఏ సోదాలు - PFI case latest news

NIA Searches in PFI case In Hyderabad: పీఎఫ్‌ఐ కేసులో ఎన్​ఐఏ మరోసారి రాష్ట్రంలో సోదాలు చేస్తోంది. చాంద్రాయణగుట్టలోని పీఎఫ్ఐ కార్యాలయంతో పాటు ఎల్బీనగర్, ఆటోనగర్‌లోని ఓ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. చాంద్రాయణగుట్టలోని పీఎఫ్​ఐ కార్యాలయాన్ని సీజ్ చేశారు.

పీఎఫ్‌ఐ కేసులో హైదరాబాద్​, కరీంనగర్​లో మరోసారి ఎన్ఐఏ సోదాలు

author img

By

Published : Sep 22, 2022, 9:23 AM IST

Updated : Sep 22, 2022, 9:28 AM IST

NIA Searches PFI Case In Hyderabad: పీఎఫ్‌ఐ కేసులో ఎన్​ఐఏ అధికారులు మరోసారి రాష్ట్రంలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని చాంద్రాయణగుట్ట పీఎఫ్ఐ కార్యాలయం.. ఎల్బీనగర్, ఆటోనగర్‌లోని ఓ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే చాంద్రాయణగుట్టలోని పీఎఫ్​ఐ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. మరోవైపు కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. పీఎఫ్‌ఐ మాజీ కార్యకర్త కోసం ఆరా తీసిన ఎన్‌ఐఏ అధికారులు.. పరారీలో ఉన్న కార్యకర్త కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

దేశవ్యాప్తంగా సోదాలు..: దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉత్తర్​ప్రదేశ్, కేరళ సహా దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. పీఎఫ్ఐకి చెందిన కీలక వ్యక్తుల నివాసాల్లో దాడులు చేసి.. దేశవ్యాప్తంగా 100 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని నిజామాబాద్​, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఎన్​ఐఏ సోదాలు నిర్వహించి పలువురు పీఎఫ్ఐకి చెందిన వారిని అదుపులోకి తీసుకుంది.

ఇవీ చదవండి: PFI కేసులో అరెస్టు చేసిన నిందితుల్ని కస్టడీకి కోరిన NIA

పీఎఫ్ఐ కార్యకలాపాలపై దేశవ్యాప్తంగా సోదాలు.. 100 మంది అరెస్ట్​

Last Updated : Sep 22, 2022, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.