లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీ మాతంగి హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ.. కొద్ది రోజులుగా పేదల ఆకలి బాధలను తీరుస్తూ, వారికి ఆరోగ్యరక్షణ కిట్లను పంపిణీ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటోంది.
పంజాగుట్ట, సోమాజిగూడలోని పేదలకు కొద్ది రోజులుగా విటమిన్ మందులతో పాటు మాస్కులు, శానిటైజర్లను అందిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లోని మురికివాడల్లో ఇప్పటివరకు 50 వేలకు పైగా కిట్లను పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. కష్ట కాలంలో మానవతావాదులంతా ముందుకొచ్చి నిరుపేదలకు అండగా నిలవాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: బీటెక్ విద్యార్థుల సాయం.. నిత్యావసరాల పంపిణీ