రాష్ట్రంలో కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. 23, 322 మందికి పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2, 256 మందికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో బాధితుల సంఖ్య 77, 513కి చేరినట్లు వివరిచింది. తెలంగాణలో కొవిడ్ బారిన పడి మరో 14 మంది మరణించగా... మెుత్తం మృతుల సంఖ్య 615కి చేరింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 464 మందికి, రంగారెడ్డి 181, మేడ్చల్ 138, వరంగల్ అర్బన్ 187, కరీంనగర్ 101, జోగులాంబ గద్వాల 95, పెద్దపల్లి 84, సంగారెడ్డి 92, భద్రాద్రి 79మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ నుంచి మరో 1,091 మంది బాధితులు కోలుకోగా.. మెుత్తం కోలుకున్న వారి సంఖ్య 54, 330కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం 22, 568 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 5లక్షల 90 వేల 306 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.