ఏపీలో గడిచిన 24 గంటల్లో 30,620 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 68 మందికి పాజిటివ్‌గా తేలింది. ఏపీలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,88,760కు చేరింది. వైరస్ బారినపడి ఇవాళ ఒకరు మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7,162కి చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో యాక్టివ్ కేసులు 814 మంది ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 106 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,80,784కి పెరిగింది.
విశాఖపట్నం జిల్లాలో 15, చిత్తూరులో 11, గుంటూరులో 9, కృష్ణాలో 7, నెల్లూరు 7, అనంతపురంలో 6, తూర్పుగోదావరిలో 4, పశ్చిమగోదావరిలో 4, కర్నూలులో 2, ప్రకాశం, కడప, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో కేసులు నమోదు కాలేదని ప్రభుత్వం ప్రకటించింది.
ఇదీచూడండి: దేశంలో మరో 9,309 మందికి కరోనా