ముఖ్యమంత్రి చంద్రబాబు... ఆటో డ్రైవర్ గా ఆకట్టుకున్నారు. ఆటోలపై జీవితకాల పన్ను రద్దు చేసిన సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన డ్రైవర్లతో.. ఆత్మీయంగా మాట్లాడారు. ఆటో కార్మికులు అందించిన డ్రైవర్ చొక్కాను ధరించిన బాబు.. కొద్ది సేపు ఆటోను నడిపి సందడి చేశారు. ప్రయాణికులు కోరుకున్న ప్రదేశానికి ఆటో డ్రైవర్లు సురక్షితంగా చేరవేస్తున్నారని ప్రశంసించిన బాబు.. తాను కూడా రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు డ్రైవర్‌గానే కృషి చేస్తున్నానని చెప్పారు.