ETV Bharat / state

ఏపీఎస్​ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు - ఏపీ ఎన్నికల సంఘం నూతన కమిషనర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Neelam Sahni, ap new sec
ఏపీఎస్​ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు
author img

By

Published : Apr 1, 2021, 12:06 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజల సహకారంతో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌ నీలం సాహ్ని అన్నారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఏపీఎస్​ఈసీగా ఆమె బాధ్యతలు చేపట్టారు. దీంతో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ఎన్నికల కమిషనర్​గా సాహ్ని గుర్తింపు పొందారు. తనపై విశ్వాసంతో ఎస్​ఈసీగా ఎంపిక చేసిన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నూతన ఎస్​ఈసీకి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీకాలం ముగియడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు ఆమె ఈ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని గవర్నర్‌ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ముఖ్యమంత్రి‌ జగన్‌ ముఖ్య సలహాదారు పదవికి ఆమె రాజీనామా చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.