కార్మిక నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా నాయిని నర్సింహారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో 1969 తెలంగాణ ఉద్యమ కారుల సమితి ఆధ్వర్యంలో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో పాటు పలువురు ఉద్యమకారులు, హిమాచల్ నుంచి దత్తాత్రేయ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. నాయిని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పోరాట యోధుడు
శ్రమజీవుల కోసం నిరంతరం తపించిన నాయినిని 'కార్మికనేత నర్సన్న' అని ఆపాయ్యంగా పిలుచుకునేవాళ్లమని దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో నాయిని చురుగ్గా పాల్గొన్నారని వెల్లడించారు. ముక్కుసూటితనానికి, పోరాట పటిమకు నాయిని నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఏ పార్టీలో ఉన్నా ఎంత పదవిలో ఉన్నా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేవారని చాడ వెంకట రెడ్డి, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు.
ఇదీ చదవండి: సైబర్ మోసం: బహుమతుల పేరిట రూ. 20 లక్షల దోపిడీ