ETV Bharat / state

కొనసాగుతున్న నయీం బినామీ దందా

గ్యాంగ్​స్టర్​ నయీం ఎన్​కౌంటర్​లో హతమై మూడేళ్లవుతుంది. నయీం మరణించినా.. అతడి అనుచరులు దందా కొనసాగిస్తున్నారు. బినామీల పేరిట ఉన్న భూముల్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలని కుట్ర పన్నారు. నిఘావర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు. రూ. 88.37 లక్షల నగదు, 3 కార్లు 6 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Mar 12, 2019, 7:58 AM IST

Updated : Mar 12, 2019, 10:41 AM IST

గ్యాంగ్​స్టర్​ నయీం
కొనసాగుతున్న నయీం బినామీ దందా
గ్యాంగ్​స్టర్​ నయీం ఎన్​కౌంటర్​లో హతమై మూడేళ్లయిన తర్వాత అతడి అనుచరులు మరోసారి భూ దందాలపై కన్నేశారు. నయీం బతికున్నప్పుడు అక్రమంగా బెదిరించి రిజిస్ట్రేషన్​ చేయించుకున్న భూముల్ని అమ్మేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బినామీల పేరిట ఉన్న భూముల్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలని కుట్ర పన్నారు. అయితే నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన రాచకొండ పోలీసులు ఆ ముఠా కార్యకలాపాల్ని ఆదిలోనే అడ్డుకోగలిగారు. నయీం భార్యతో సహా ఐదుగురిని అరెస్టు చేసి.. వారు ముందస్తుగా వసూలు చేసిన రూ.88.37 లక్షల నగదు, మూడు కార్లు, ఆరు చరవాణీలను స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు.

ఇవీ చూడండి:13న విచారణకు హాజరు కావాల్సిందే...!

బినామీ భూమిని అమ్మేందుకు కట్ర:

నయీం అనుచరుడు పాశం శ్రీనుపై ఇప్పటికే చాలా కేసులున్నాయి. నయీం భార్య హసీనా బేగం కూడా పీడీ యాక్టు కింద జైలు శిక్ష అనుభవించి బయటకి వచ్చారు. భువనగరిలోని సర్వే నెంబర్ 730 లోని 5 ఎకరాల భూమి గతంలో నయీం... అతని అనుచరుడు తుమ్మ శ్రీనివాస్​పై రిజిస్ట్రేషన్ చేశాడు. ప్రస్తుతం ఆ భూమిని డీవీఆర్ ఎస్టేట్​కు చెందిన మండపల్లి వెంకటేశ్వర్ రావుకు విక్రయించేలా ఒప్పందం జరిగింది. తమ్మ శ్రీనివాస్... భూమిని వెంకటేశ్వర్ రావు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు నయీం గ్యాంగ్ ఏర్పాట్లు చేసుకుంది. తిరిగి ఆ భూమిని మోక్ష డెవలపర్స్ సంస్థకు విక్రయించేలా వెంకటేశ్వర్ రావు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

రూ. 5 కోట్లకు నిర్ణయం:

నయీమ్ భార్య హసీనా బేగం మొదట భూమిని రూ. 5 కోట్లుగా నిర్ణయించినప్పటికీ వివాదాస్పదమైన భూమి కావడంతో రూ.89 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వచ్చిన డబ్బులో వాటాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. భూమికి సంబంధించిన జిరాక్స్ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయాలని భువనగిరి సబ్ రిజిస్ట్రార్​ను కోరారు. నిషేధం ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు అంగీకరించడం వల్ల సబ్ రిజిస్ట్రార్ సహాదేవ్​ను పోలీసులు రిమాండ్​కు తరలించారు. ఈ ముఠా ఇంకా ఏమైనా దందాలకు పాల్పడిందా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Intro:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగాయి... ఈ ఎన్నికల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ తొర్రూరు అధ్యక్షునిగా బిజ్జాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు... ప్రధాన కార్యదర్శిగా చిదురాల మహేష్ , కోశాధికారిగా హరి శంకర్ లుగెలుపొందారు...

Body:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగాయి... ఈ ఎన్నికల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ తొర్రూరు అధ్యక్షునిగా బిజ్జాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు... ప్రధాన కార్యదర్శిగా చిదురాల మహేష్ , కోశాధికారిగా హరి శంకర్ లుగెలుపొందారు...

Conclusion:9949336298
Last Updated : Mar 12, 2019, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.