ETV Bharat / state

Telangana Regional Ring Road : తెలంగాణ ఆర్​ఆర్​ఆర్​ భూసేకరణకు కసరత్తు షురూ

Telangana Regional Ring Road : హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు అవతల నిర్మించతలపెట్టిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనుల కోసం భూసేకరణ కసరత్తు మొదలైంది. తొలి విడతలో భాగంగా ఉత్తర భాగం పనుల కోసం భూ యజమనానుల గుర్తింపునకు త్వరలోనే సర్వే నిర్వహించనున్నారు. భూ యజమానుల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి వాటిపై తుది నిర్ణయం తీసుకుంటారు.

RRR
RRR
author img

By

Published : May 12, 2023, 6:53 AM IST

Telangana Regional Ring Road : ప్రాంతీయ రింగు రోడ్డు(RRR) ఉత్తర భాగంలో తొలివిడతగా సంగారెడ్డి నుంచి తూప్రాన్‌ వరకు నిర్మించే రహదారి కోసం భూ సేకరణకు రంగం సిద్ధమవుతోంది. ఆ మార్గం వెళ్లే ప్రాంతాల్లో భూముల ప్రస్తుత యజమానులు ఎవరన్నది నిర్ధారించే సర్వే చేపట్టేందుకు వీలుగా జాతీయ రహదారుల సంస్థ కసరత్తు చేపట్టింది. త్వరలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 3-D నోటిఫికేషన్‌ జారీ అయింది.

ఆ ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం సగం మొత్తం చెల్లించాలి : భూ యజమానుల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి వాటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తరవాత 3-G నోటిఫికేషన్‌ జారీచేస్తారు. ఈ మార్గం నిర్మాణానికి సుమారు 236 ఎకరాలు సేకరించాల్సి ఉంది. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్‌ వరకు 158.50 కిలోమీటర్ల ఉత్తర భాగం రహదారిని నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇందులో తొలి విడతగా 60 కిలోమీటర్ల రహదారిని నిర్మించాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. భూ సేకరణకు అయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం మొత్తాన్ని చెల్లించాలి. ఆ మొత్తాన్ని దశలవారీగా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేయటంతో ఉత్తర భాగాన్ని దశలవారీగా చేపట్టాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది.

ప్రామాణిక ధరకు రెండు రెట్లు అధికంగా చెల్లింపు : పరిహారాన్ని చెల్లించేందుకు వీలుగా అధికారులు గణాంకాలను సేకరించాలని నిర్ణయించారు. భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీని ప్రామాణికంగా తీసుకుని అంతకుముందు మూడు సంవత్సరాల్లో ఆయా గ్రామాల్లో జరిగిన భూ లావాదేవీల ధరలను పరిగణనలోకి తీసుకుని సగటు అమ్మకపు విలువను లెక్కిస్తారు. సగటు అమ్మకపు విలువ, భూ విలువలను పరిగణనలోకి తీసుకుని ఎకరానికి చెల్లించే పరిహారాన్ని ఖరారు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రామాణిక ధరకు రెండు రెట్లు అధికంగా చెల్లిస్తారు. పట్టణ ప్రాంతాల్లో ప్రామాణిక ధరకు రెట్టింపు చెల్లిస్తారు.

భూ సేకరణ చట్టం-2013 మేరకు పరిహారాన్ని నిర్ణయిస్తామని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం చెల్లించే పరిహారం తక్కువగా ఉందని భావించిన పక్షంలో భూ సేకరణ అప్పీలేట్‌ అథారిటీకి దరఖాస్తు చేసుకునే అవకాశం యజమానికి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి-తూప్రాన్‌ మార్గానికి సంబంధించిన భూసేకరణ కసరత్తును త్వరలో చేపట్టనున్నట్లు జాతీయ రహదారుల వర్గాలు తెలిపాయి. నెలన్నర నుంచి రెండు నెలల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్న వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.