ETV Bharat / state

'ఆ మూడు కేంద్ర ఆర్డినెన్స్‌లను వ్యతిరేకిస్తూ 14న దేశవ్యాప్త సమ్మె' - Anti farmer Ordinance From central Government

రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడు కేంద్ర ఆర్డినెన్స్‌లను వ్యతిరేకిస్తూ... అఖిల భారత పోరాట సమన్వయ కమిటీ సెప్టెంబర్‌ 14న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. అన్నదాతలపై మోపిన కేంద్ర విద్యుత్‌ సంస్కరణల బిల్లులను వెంటనే రద్దు చేయాలని సమన్వయ కమిటీ కన్వీనర్లు పశ్య పద్మ, సాగర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం తలపెట్టిన అందోళన కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయనున్నట్లు కన్వీనర్లు స్పష్టం చేశారు.

'ఆ మూడు కేంద్ర ఆర్డినెన్స్‌లను వ్యతిరేకిస్తూ 14న దేశవ్యాప్త సమ్మె'

author img

By

Published : Sep 12, 2020, 3:34 PM IST

రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడు కేంద్ర ఆర్డినెన్స్‌లను వ్యతిరేకిస్తూ... అఖిల భారత పోరాట సమన్వయ కమిటీ సెప్టెంబర్‌ 14న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఎన్​డీఏ సర్కార్ కేంద్ర విద్యుత్‌ సంస్కరణల బిల్లులను రద్దు చేయాలని సమన్వయ కమిటీ కన్వీనర్లు పశ్య పద్మ, సాగర్‌ డిమాండ్‌ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను చట్టబద్ద హక్కుగా చేయాలన్నారు. ఇందుకు నూతన చట్టాన్ని రూపొందించాలని కోరారు.

తెలంగాణ వ్యాప్తంగా..

14న తలపెట్టిన అందోళన కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు ధర్నా చేయనున్నట్లు కన్వీనర్లు పేర్కొన్నారు.

బిల్లుల ప్రతులను తగలబెట్టడమే..

రైతు వ్యతిరేక కేంద్ర ఆర్డినెన్స్‌ల విద్యుత్‌ సవరణ బిల్లుల ప్రతులను తగులబెట్టాలని నిర్ణయించారు. కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్టేబెట్టేందుకే అత్యవసర సరుకుల నిల్వల పరిమితి రద్దు, వ్యవసాయ ఉత్పత్తులు ఎవరికైనా, ఎక్కడైనా అమ్ముకునే స్వచ్ఛ, కాంట్రక్ట్ వ్యవసాయానికి సంబంధించిన కేంద్ర ఆర్డినెన్సులను తెచ్చిందని మండిపడ్డారు.

అందరికీ ఆ పథకాలు కావాలి..

అన్నదాతలు, కౌలు, పోడు రైతులందరికీ.. రైతు బంధు, పీఎం కిసాన్‌ పథకాలు అమలు చేయాలని కమిటీ కన్వీనర్ పద్మ డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి : సోమవారం తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.