ETV Bharat / state

De-Adiction: మత్తు మాయను తరిమికొట్టేందుకే.. ఈ 'నశా విముక్త భారత్‌ అభియాన్‌' - De-Adiction centres in telangana

nasha mukt bharat abhiyan: మత్తు మాయ..! పెద్దోళ్ల వ్యవహరమిది..! ఒకప్పుటి మాట ఇది. ఈ మాయ ఇప్పుడు మన గల్లీల్లోకి చొరబడింది. విద్యార్థులను, యువతను ఈ రొంపిలోకి దింపుతోంది. ఆరోగ్యాన్నే కాదు... మానసిక ప్రశాంతతనూ నాశనం చేస్తోంది. విద్యార్థుల చదువులు ఆగమవుతున్నాయి. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఈ సమస్యకు పరిష్కారం చూపుతు న్నాయి...డీ-అడిక్షన్‌ కేంద్రాలు. వీటికి మరింత చేయూతనిచ్చేందుకు కేంద్ర సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో "నశా ముక్త భారత్ అభియాన్" కార్యక్రమం మెుదలైంది. మత్తు బాధితులకు సరికొత్త జీవితాన్ని అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో సుమారు వంద డీ-అడిక్షన్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. అవగాహన కల్పిస్తూ బంగారు భవిష్యత్​లపై కొత్త ఆశలు రేకెత్తిస్తున్న ఆ చికిత్స పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

De-Adiction: మత్తు మాయను తరిమికొట్టేందుకే.. ఈ 'నశా విముక్త భారత్‌ అభియాన్‌'

author img

By

Published : Dec 9, 2021, 12:38 PM IST

De-Adiction: మత్తు మాయను తరిమికొట్టేందుకే.. ఈ 'నశా విముక్త భారత్‌ అభియాన్‌'

nasha mukt bharat abhiyan: దేశంలోని విద్యార్థులు, యువత బంగారు భవిష్యత్తును మాదక ద్రవ్యాలు నాశనం చేస్తున్నాయి. గణాంకాల ప్రకారం.. 25 ఏళ్లలోపు యువతే అధికంగా బానిసలవుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ మత్తు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు సమాజంలో కుటుంబం గౌరవం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి. మానసిక ఒత్తిళ్ల ప్రభావమో... తోటి స్నేహితుల ప్రోద్బలమో... కారణం ఏదైతేనేం...? పిల్లలు, యువతనూ మత్తుమేఘాలు కమ్మేస్తుకుంటున్నాయి. చాటు మాటు అంగళ్లు దాటుకుని పాఠశాలలు, కళాశాల ప్రాంగణాలకూ మాదక ద్రవ్యాలు విస్తరిస్తున్నాయి.

మొదట్లో సంతోషం.. చివరికి వ్యసనం

సాధారణంగా ఇష్టమైన పదార్థాలు తింటే సంతోషంగా అనిపిస్తుంది. నచ్చిన సంగీతం వింటే మదిలో నూతనోత్సాహం నిండుతుంది. మాదక ద్రవ్యాలు తీసుకుంటే కూడా సరిగ్గా ఇలాంటి అనుభూతులే కలుగుతుంటాయి. ఆనందం, సంతోషం, ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి భావోద్వేగాలను పెద్ద ఎత్తున ప్రేరేపించి దూకుడుతనాన్ని పెంచుతాయి. మాదక ద్రవ్యాలు మొదట్లో ఆనందం, సంతోషం కలిగిస్తుండొచ్చు గానీ క్రమంగా శరీరం ఆ ప్రభావాలు తట్టుకునే సామర్థ్యం సంతరించుకుంటూ వస్తుంది. ఫలితంగా మునుపటిలా సంతోషం, ఆనందం కలగవు. అందువల్ల మరింత ఎక్కువ మోతాదులో తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. కొంతకాలానికి అది కూడా సరిపోదు. ఆ మత్తు మోతాదు మరింత పెంచుకునేలా ఉసిగొల్పుతోంది. తద్వారా... మెదడులోని నాడీ కణాల్లోనూ మార్పులు తలెత్తి... తరచూ మాదక ద్రవ్యాలు తీసుకోవడం మొదలవుతుంది. చివరికి అవి లేకపోతే ఉండలేని స్థితీ తలెత్తుతుంది. ఇదే చివరికి వ్యసనానికి దారిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దడమే ప్రధానోద్దేశం

గల్లీల్లోకి చేరువైన మత్తును తరిమికొట్టడానికి..కేంద్ర ప్రభుత్వం నశా విముక్త భారత్‌ అభియాన్‌(NMBA) కార్యక్రమం అమలు చేస్తోంది. భారతదేశాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ దీనిపై అధిక శ్రద్ధ చూపిస్తున్నారు."నశా ముక్త భారత్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 100కు పైగా డీ-అడిక్షన్ కేంద్రాలు నడుస్తున్నాయి.

బాధితులకు 1నుంచి 3నెలల్లో చికిత్స

మత్తుకు బానిసలైన వారిని చికిత్స కేంద్రాలకు తీసుకురావటం కత్తి మీది సామే. కుటుంబ సభ్యులు నచ్చజెప్పి ఆ పని చేయాలి. అలా వచ్చే బాధితులకు 1 నుంచి 3 నెలల చికిత్సలో తొలుత వైద్య పరీక్షలు చేస్తారు. హిమోగ్లోబిన్ శాతం, కాలేయం, మూత్రపిండాల పనితీరు, మానసిక స్థితి పరిశీలిస్తారు. క్షయ, కామెర్లు సోకాయేమో పరీక్షిస్తారు. అనంతరం 3 నుంచి 4 రోజులు సోషల్‌ వర్కర్లు, సైకియాట్రిస్టులు, వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తారు. ఒక్కసారిగా మత్తు అలవాటు మాన్పించడంతో చేతులు వణకడం, కోపతాపాలు ప్రదర్శించటంతో పాటు బాధితులు వింతగా ప్రవర్తిస్తారు. ఈ సమయంలో వైద్యుల పర్యవేక్షణలో వారికి యాంటీ టాక్సిఫికేషన్‌ మందుల్ని అందిస్తారు. పది రోజుల కోర్సు పూర్తయ్యాక బాధితుల కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ చేస్తారు. చికిత్స అనంతరం వారానికి రెండు మూడు సార్లు ఫోన్‌లో మాట్లాడుతూ అవసరమైన సూచనలు ఇస్తారు. మత్తు మాన్పించే ప్రక్రియలో రోజంతా బాధితులు ఏదో ఓ పనితో బిజిబిజిగా గడిపేలా చేస్తారు. మానసికంగా కౌన్సిలింగ్‌తో పాటు శారీరకంగా దృఢంగా ఉండేలా తీర్చిదిద్దుతారు.

చికిత్స ఇలా..

సాధారణంగా మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రమైతే సైకియాట్రిస్టుల పర్యవేక్షణలో డీ-అడిక్షన్‌ కేంద్రాల్లో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటంది. ముందుగా డ్రగ్స్ రకాలను బట్టి బెంజోడైజపీన్స్, నాల్‌ట్రెక్సాన్, మెథడాన్ వంటి మందులతో చేతులు కాళ్లు వణకడం, ఆందోళన వంటి లక్షణాలు తగ్గించడానికి ప్రయత్నిస్తారు. ఈ మందులు పెద్ద మొత్తంలో ఆరంభించడం ద్వారా క్రమంగా తగ్గించుకుంటూ వస్తారు. పరిస్థితి కుదురుకున్నాక పూర్తిగా ఆపేస్తారు. ఫలితంగా శరీరంలో మాదక ద్రవ్యాల దుష్ఫ్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఉపశమనం లభిస్తుంది. కొందరు తిరిగి మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావచ్చు. అందువల్ల యాంటి క్రేవింగ్ మందులు కూడా ఇస్తారు. ఇవి మాదక ద్రవ్యాలు తీసుకోవాలన్న కోరిక కలుగకుండా చూస్తాయి.

తల్లిదండ్రులు గుర్తించాలి..

పిల్లలు మత్తుకు అలవాటైన విషయాన్ని తల్లిదండ్రులు మొదట్లోనే గుర్తించలేకపోతున్నారు. బడికి వెళ్లకపోవటం, మార్కులు తక్కువ రావటంతో పాటు విద్యాసంస్థల నుంచి హెచ్చరిక వచ్చాకే ఎక్కువ కేసుల్లో అసలు విషయం వారికి తెలుస్తోంది. తల్లిదండ్రులు మొదట్లోనే సరైన చికిత్స, కౌన్సెలింగ్‌ ఇప్పిస్తే పిల్లలు కోలుకునే వీలుంటుంది. మత్తు బారిన పడినవారిలో మార్పులు తీసుకు రావడంలోనూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులదే కీలక పాత్ర. గత విషయాలు గుర్తుచేయకుండా, సూటిపోటి మాటలనకుండా కొత్త జీవితం దిశగా వారిని మళ్లించాలి. చెడు స్నేహితుల్ని దూరం పెట్టాలి. ఫోన్‌లో వారి నంబర్లు తొలగించాలి. పశ్చాత్తాపంతో జనజీవనంలోకి రావాలనుకునే బాధితులను అన్ని విధాలా ఆదరించాలి.

పోలీసుల కఠిన ఆంక్షలు

మత్తుమాయ వెంట పరిగెత్తుతున్న వారిపై పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకుంటున్నారు. ఇవి మాత్రమే కాదు...డీ-అడిక్షన్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న బాధితులు సత్ప్రవర్తన మార్గంలో వెళ్లేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రజలు పాలుపంచుకోవాలి..

దేశంలో మాదక ద్రవ్యాల వినియోగదారుల సంఖ్య 6 కోట్లకు పైగానే ఉంది. వీరిలో ఎక్కువ మంది 10 నుంచి 17 ఏళ్ల వయస్సు కలిగిన వారేనని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ సమగ్ర సర్వే తెలియజేస్తుంది. మాదకద్రవ్యాలు, ఆ దుష్పరిణామాలు తదితర సమస్యల పరిష్కారానికి ఆ శాఖ ఎన్నో చర్యలు తీసుకుంది. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే జాతీయ కార్యాచరణ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 500 స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. మాదక ద్రవ్యాల బెడదను ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే నివారించగలం కాబట్టి..నశా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాల్లో సామాన్య ప్రజలు పాలుపంచుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది.

ధైర్యంగా ఈ కేంద్రాల్లో చేర్చండి..

మత్తుకు అలవాటుపడటం ఇప్పుడు సాధారణమైపోయింది. అలా అని.. వారిని అలాగే వదిలేయడం తప్పు. ఇలాంటి డీ-అడిక్షన్‌ సెంటర్లు మన దగ్గరలోనే ఉన్నాయి. ఈ సెంటర్లను సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లు 96664 66118, 9666 66119, లేదా 9985360968. చుట్టుపక్కల వారికి తెలిస్తే పరువు పోతుంది వంటివి పక్కనపెట్టి... బాధితుల్ని ధైర్యంగా ఈ సెంటర్లలో చేర్చండి. లేకపోతే... బంగారు భవిష్యత్తున్న యువత మన కళ్ల ముందే మత్తులో చిత్తవడం ఖాయం.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.