నారాయణ, శ్రీచైతన్య కళాశాలల వ్యవహారంపై మేడిపల్లికి చెందిన సామాజిక కార్యకర్త రాజేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. ఈ రెండు కళాశాలలపై ధర్మాసనానికి ఇంటర్ బోర్డు విచారణ నివేదిక సమర్పించింది. సుమారు 45 కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా లేవని ఆ నివేదికలో వెల్లడించింది. నిబంధనలు పాటించని కళాశాలల్లో దాదాపు 20 వేల మంది విద్యార్థులున్నారని... ఆ కళాశాలలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని హైకోర్టు ప్రశ్నించింది.
గుర్తింపు లేని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులతో ఎందుకు చెలగాటం అడుతున్నారంటూ... ఈనెల 25లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: లవ్ ఫెయిల్ అంటూ బైక్పై అతివేగం.. గాల్లో ప్రాణాలు