"ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణ ఆపాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసన.. రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమా?" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల వద్ద.. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్(nara lokesh fire on police lathi charge at anantapur ) చేయడాన్ని లోకేశ్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దమనకాండ సాగించడం.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
-
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం @ysjagan అహంకార ధోరణికి నిదర్శనం. అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/14TKhQIGyt
— Lokesh Nara (@naralokesh) November 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం @ysjagan అహంకార ధోరణికి నిదర్శనం. అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/14TKhQIGyt
— Lokesh Nara (@naralokesh) November 8, 2021శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం @ysjagan అహంకార ధోరణికి నిదర్శనం. అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/14TKhQIGyt
— Lokesh Nara (@naralokesh) November 8, 2021
పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించడంతో పాటు, లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమాలు అణచివేయాలని చూస్తే.. గుణపాఠం తప్పదని లోకేశ్ హెచ్చరించారు.
ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన లోకేశ్(lokesh on aided schools)... ఎస్‍ఎస్‍బీఎన్ కళాశాల వద్ద దాడి ఘటన(police lathicharge on students at anantapur)కు సంబంధించిన దృశ్యాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
ఇదీ చదవండి.. Medchal Mephedrone drug case: కొనసాగుతున్న వేట.. ఆ ఐదు ఇళ్లలో సోదాలు!
గంజాయి మొక్కల కలకలం.. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే పెంపకం..