ETV Bharat / state

రామచంద్ర భారతి బెయిల్​ రద్దుకు నాంపల్లి హైకోర్టు నిరాకరణ - mla poaching case

Nampally Court rejects Ramachandra Bharti's bail cancellation: ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి బెయిల్​ రద్దుకు నాంపల్లి హైకోర్టు నిరాకరించింది. ఫోర్జరీ పత్రాల కేసులో బంజారాహిల్స్​ పోలీసులు బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్​లో తగిన కారణాలు లేవంటూ పేర్కొంది.

రామచంద్ర భారతి
రామచంద్ర భారతి
author img

By

Published : Mar 18, 2023, 5:33 PM IST

Nampally high Court rejects Ramachandra Bharti's bail cancellation: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి బెయిల్‌ రద్దుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఫోర్జరీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌ కార్డులు కలిగి ఉన్నారన్న కేసులో రామచంద్ర భారతి బెయిల్ రద్దు చేయాలన్న బంజారాహిల్స్ పోలీసుల పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌ కార్డును దుర్వినియోగం చేశారంటూ రామచంద్రభారతిపై బంజారాహిల్స్ పోలీసులు గతంలో వివిధ చట్టాలపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో రామచంద్ర భారతి విడుదల కాగానే జైలు వద్దనే బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. రామచంద్ర భారతికి న్యాయస్థానం అదేరోజు వెంటనే బెయిల్ ఇచ్చింది.

బెయిల్ రద్దు చేయాలని డిసెంబరు 15న బంజారాహిల్స్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​పై నాంపల్లి కోర్టు వాదనలు విని తీర్పు వెల్లడించింది. రామచంద్ర భారతి తరఫు న్యాయవాది రామారావు ఇమ్మానేని వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ రద్దు చేయడానికి తగిన కారణాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

అసలేం జరిగిందంటే:

మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేందుకు డబ్బులు ఇస్తామంటూ పైలట్‌ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో అక్టోబర్​ నెల 26న ప్రలోభాలకు గురి చేసిన రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఏ1 నిందితుడు రామచంద్ర భారతి.. బెయిల్​పై చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.

'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో జైలు నుంచి విడుదలవగానే..బోగస్ ఆధార్, పాన్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ నకిలీ డాక్యూమెంట్ల కేసులో బంజారాహిల్స్‌ పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఈ కేసులో రామచంద్ర భారతికి నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. మరోవైపు నందకుమార్​పై బంజారాహిల్స్ ఠాణాలోనే 5 ఛీటింగ్ కేసులు నమోదయ్యాయి. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్​లో నందకుమార్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మెదక్ జిల్లా గజవాడకు చెందిన బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రూ.80 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.