రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ నిర్మించేదేనని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. రీ డిజైనింగ్, రీ ఇంజినీరింగ్ ప్రాజెక్టులంటూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 106 టీఎంసీల నీరు ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి వచ్చిందన్నారు. ఆ ఆయకట్టును చూపించి మొత్తం నీళ్లన్నీ తానే ఇచ్చానని సీఎం ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
ప్రభుత్వం చేసే అక్రమాలను అడ్డుకుంటారని ప్రతిపక్షాలు లేకుండా నిర్వీర్యం చేశారని చెప్పారు. పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం నుంచి సరైన ప్రకటన రాకపోతే జూన్ 2 నుంచి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపడుతుందన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రం నుంచి ఇవాళ 45 వేల మంది వలస కార్మికుల తరలింపు...