ETV Bharat / state

భవిష్యత్తు వ్యవసాయ రంగం అద్భుతంగా ఉంటుంది: నాబార్డు ఛైర్మన్​

కరోనా ప్రభావం ఉన్నా వ్యవసాయ పనులు ఆగలేదని.... రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా చర్యలు చేపట్టామని... నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు అన్నారు. రైతుల ఖర్చులు తగ్గించేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. నాబార్డులో పరిపాలనా విధానంలోనూ మార్పులు తీసుకొస్తున్నామని వివరించారు. నాలుగైదు నెలల్లో క్రెడిట్ గ్యారంటీ స్కీంను ప్రారంభించబోతున్నామన్నామని ప్రకటించారు.

భవిష్యత్తు వ్యవసాయ రంగం అద్భుతంగా ఉంటుంది: నాబార్డు ఛైర్మన్​
భవిష్యత్తు వ్యవసాయ రంగం అద్భుతంగా ఉంటుంది: నాబార్డు ఛైర్మన్​
author img

By

Published : Aug 28, 2020, 7:44 PM IST

దేశంలో భవిష్యత్తు వ్యవసాయం అంతా అద్భుతంగా ఉండబోతోందని నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. రష్యా, చైనా అనుభవాల నేపథ్యంలో రాబోయే పదేళ్ల కాలంలో భారత్​లో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారానే వ్యవసాయ అనుబంధ రంగాలు ఉంటాయని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉత్పాదకత, నాణ్యత పెంపు, నిల్వ, ప్రొసెసింగ్, విదేశాలకు ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని వెల్లడించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్​రోడ్స్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

భవిష్యత్తు వ్యవసాయ రంగం అద్భుతంగా ఉంటుంది: నాబార్డు ఛైర్మన్​

సరికొత్త స్కీములతో...

దేశవ్యాప్తంగా పది వేల రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు 4 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని గోవిందరాజులు తెలిపారు. అందుకోసం క్రెడిట్ గ్యారంటీ స్కీం ప్రారంభిస్తున్నామని‌ చెప్పారు. సహకార రంగం బలోపేతం, రైతులకు మరిన్ని సేవలందించేందుకు నాబార్డ్ ప్రయత్నిస్తోందని వివరించారు. దేశవ్యాప్తంగా... ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో సహకార సంఘాల్లో పాలన, పారదర్శకత కోసం కంప్యూటీకరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సొసైటీ వ్యాపార అవకాశాలు పెంపునకు కృషి చేస్తున్నామని చెప్పారు.

తెలుగు వాడిగా తెలుగు రాష్ట్రాలకు అండగా ఉంటా

ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ కింద అగ్రి ఇన్ఫ్రా కింద కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు కేటాయించిందని... అందులో భాగంగా నాబార్డ్ కూడా రూ.5 వేల కోట్లు ఇవ్వబోతుందని వివరించారు. ఈ ఏడాది నాబార్డ్ వ్యాపారం 5.35 నుంచి 6.50 లక్షల కోట్ల రూపాయలకు తీసుకెళ్లాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై... ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయం అభివృద్ధి, రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి... నాబార్డ్ సంస్థాగతంగా ఏం చేయాలన్న అంశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్​తో కూడా చర్చించానని తెలిపారు. ఒక తెలుగువాడిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి పథకాల అమలుకు నాబార్డ్ వీలైనంత సాయం అందిస్తుందని గోవిందరాజులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది: తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.