వ్యవసాయరంగానికి నాబార్డు దాదాపు రూ.15 లక్షల కోట్ల రుణాలు ఇస్తోందని... వాటి చెల్లింపు సక్రమంగా జరగాలంటే విలువ జోడింపు జరగాలని నాబార్డు ఛైర్మన్ డా.జీఆర్ చింతల అన్నారు. అటల్ ఇంక్యుబేషన్ మిషన్, నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటైన కూకట్పల్లి అలీప్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లోని 'అలీప్ వీ హబ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేటర్' ను ఆయన ప్రారంభించారు. దీనితో పాటు ఎంబ్రాయిడరీ ఎంటర్ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఆవిష్కరించారు.
వ్యవసాయం కొత్త పుంతలు తొక్కాలంటే పంటల ఉత్పత్తి అనంతరం సాంకేతికను వినియోగించి విలువ జోడించాల్సిన అవసరం ఉందని జీఆర్ చింతల అన్నారు. ఒకప్పుడు సాంకేతికత విషయంలో వేరే దేశాల ఘనతల గురించి మాట్లాడుకునే వాళ్లమని... ఇప్పుడు మన దేశంలోనే సాంకేతిక అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనా వైరస్ స్ట్రెయిన్‌తో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తం