హైదరాబాద్ సైబరాబాద్లో కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ అధికారుల సమావేశం జరిగింది. కంటోన్మెంట్ సరిహద్దు పరిధిలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు కంటోన్మెంట్ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకున్నాకే నిర్మాణ అనుమతులివ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నగరంలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మరింత సమన్వయంతో పనులను సకాలంలో పూర్తిచేయాలని నిర్ణయించారు. కంటోన్మెంట్‌లో ఆర్మీకి సంబంధించిన ఎన్నో సున్నిత, భద్రతాపరమైన అంశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ సరిహద్దుల వెంట నిర్మాణాలకు అనుమతులు జారీచేసే సమయంలో ఆర్మీ నుంచి ఎన్ఓసీ తీసుకోవడంలేదని ఆర్మీ అధికారులు ఈ భేటీలో లేవనెత్తారు.
'కంటోన్మెంట్ అనుమతి తీసుకోవాల్సిందే' - contonment
హైదరాబాద్ కంటోన్మెంట్ సరిహద్దులో బహుళ అంతస్తుల నిర్మాణాలకు కంటోన్మెంట్ బోర్డు నుంచి నిరభ్యంతర పత్రం తీసుకున్నాకే భవన నిర్మాణానికి అనుమతివ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సైబరాబాద్లో కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ అధికారుల సమావేశం జరిగింది.