ETV Bharat / state

సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం మహిళల ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్​ చాంద్రాయణగుట్ట సమీపంలో ముస్లిం మహిళలు ఆందోళనకు దిగారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత మియా దర్గాహ్​ మైదానంలో నిరసన వ్యక్తం చేశారు.

author img

By

Published : Feb 22, 2020, 9:45 AM IST

Muslim women protest against citizenship amendment act in Hyderabad
సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం మహిళల ఆందోళన
సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం మహిళల ఆందోళన

సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్​ చాంద్రాయణగుట్ట సమీపంలో ముస్లిం మహిళలు నిరసనకు దిగారు. ముంతాజ్​ బాగ్​లో ఉన్న మియా దర్గాహ్​ మైదానంలో బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అర్ధరాత్రి వరకు మహిళలు ఆందోళన విరమించకపోవడం వల్ల పోలీసులు రంగంలోకి దిగారు. నిరసన ఆపివేయాలని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. మహిళలు వినిపించుకోలేదు. సామాజిక మాధ్యమాల్లో ఆందోళన చూసి మరికొంత మంది నిరసనకారులు ముంతాజ్​ బాగ్​ చేరుకున్నారు. సీఏఏను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం తెల్లవారుజామున నిరసనకారులు ఆందోళన విరమించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.