ETV Bharat / state

Indian Idol: సంగీత ప్రియులకు గుడ్​న్యూస్.. ప్రతీవారం కచేరీలు ఎక్కడంటే? - తెలంగాణ వార్తలు

భాగ్యనగరంలోని సంగీత ప్రియులకు ఇండియన్ ఐడల్(Indian Idol) పోటీదారులు గుడ్​న్యూస్ చెప్పారు. రివైవ్‌ కన్సర్ట్‌ సిరీస్‌ పేరుతో ఎలెవన్‌ పాయింట్‌ టూ, మెటాలాయిడ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. సెప్టెంబ‌ర్ నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు ప్రతివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంగీత కచేరీలు జరగనున్నాయని తెలిపారు.

Indian Idol winners, music festival in hyderabad
హైదరాబాద్​లో సంగీత కచేరీ, ఇండియన్ ఐడల్ విజేతలతో కచేరీ
author img

By

Published : Aug 29, 2021, 12:53 PM IST

ఇండియన్‌ ఐడల్‌(Indian Idol) గాయకులు భాగ్యనగర సంగీత ప్రియులను తమ గాన మాధుర్యంతో ఉర్రూతలూగించనున్నారు. రివైవ్‌ కన్సర్ట్‌ సిరీస్‌ పేరుతో ఎలెవన్‌ పాయింట్‌ టూ, మెటాలాయిడ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ప్రత్యేక సంగీత కచేరీ నిర్వహించనున్నాయి. సెప్టెంబ‌ర్ నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు ప్రతివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో(Prasad Digital Film Lab) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండియన్ ఐడల్ పోటీదారులు పాల్గొన్నారు. వారిలో ఇండియన్‌ ఐడల్‌ విజేత పవన్‌దీప్‌ రాజన్‌(pawandeep rajan), మొదటి రన్నరప్ అరుణిత కంజిలాల్(Arunita kanjilal), రెండో రన్నరప్ శైలీ(sayli kamble), మూడో రన్నరప్ మొహమ్మద్ డానిష్​తో(Mohd. Danish) పాటు రాక్‌స్టార్ షణ్ముఖ ప్రియ(shanmukha priya) ఉన్నారు.

కరోనా(corona) తర్వాత ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న తొలి సంగీత కచేరి అని మెటలోయిడ్‌ ప్రొడక్షన్‌ ప్రతినిధి ప్రీతిష్‌ కోలాటి తెలిపారు. బ్యాండ్‌, గాయకులు, సంగీత కళాకారులతో క‌లిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా తైక్కుడం బ్రిడ్జ్ క‌ళాకారుల ఆధ్వర్యంలో సెప్టెంబ‌ర్ 2న, ఇండియ‌న్ ఐడ‌ల్ విజేత ప‌వ‌న్‌దీప్ రాజన్‌తో సెప్టెంబ‌రు 3న హార్ట్‌క‌ప్‌లో ప్రద‌ర్శన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: sayli kamble: ఆ ఇంట్లో ఒకప్పుడు తిండికీ తిప్పలు.. ఇప్పడు సెలబ్రిటీ ఫ్యామిలీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.