కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న తమను అదుకోవాలంటూ... తెలంగాణ మస్క్యూలర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. జన్యుపరమైన లోపంతో జన్మించిన తమను ప్రభుత్వాలు ఆదుకోవట్లేదంటూ వాపోయారు. ఈ మేరకు హెచ్చార్సీ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్యకు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ తల్లిదండ్రుల వయసు పైబడటం వల్ల సంరక్షణ కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు.
'మానవతా కోణంలో చూడాలి'
ప్రభుత్వం ఇస్తోన్న 3016 రూపాయల ఆసరా పెన్షన్ సరిపోక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. తమను చూసుకునేందుకు కేర్ టేకర్లు కావాలని అన్నారు. వారిని నియమించుకునేందుకు నెలకు 10 వేల రూపాయల భత్యం ప్రభుత్వమే చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఛైర్మన్‌ను వేడుకున్నారు. ప్రభుత్వం సైతం మానవత్వంతో వీరిని ఆదుకోవాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు.
ఇవీ చూడండి : 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో బలహీన వర్గాలకు అన్యాయం'