మొహర్రం(Muharram) సంతాప దినాల్లో భాగంగా ఈనెల 20న జరగనున్న బీబీకా ఆలం ఊరేగింపు కోసం శనివారం ట్రయల్ రన్ చేపట్టారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో మొహర్రం నెల 10న అంబారీపై ఊరేగింపు జరగనుంది. కాగా ఇవాళ డబీర్‌పురలోని బీబీకా ఆలం వద్ద నుంచి చాదర్‌ఘాట్ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు.
మహారాష్ట్ర కొల్హపూర్ నుంచి తీసుకొచ్చిన మాధురి అనే ఏనుగు మీద బీబీకా ఆలం ఊరేగింపు ఉంటుంది. బీబీకా ఆలం నుంచి యాకుత్‌పురా మసీదు, అలీ జా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌస్, పంజే షా, మండీ మీర్ ఆలం, దారుల్ షిఫా, కాలిఖబర్ మీదుగా చాదర్‌ఘాట్ వరకు ఈ ట్రయల్ నిర్వహించారు. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ ఆధ్వర్యంలో పోలీసుల పటిష్ఠ బందోబస్తు నడుమ ఈ ట్రయల్ రన్ జరిగింది.
ఇదీ చదవండి: NRI FAMILY DEATH CASE: ఆ కుటుంబాన్ని చంపేసింది.. వాళ్ల పెద్దకొడుకేనట!