సోమవారం నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టినప్పటికీ... ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడం ఆలస్యమైంది. దీంతో రెండ్రోజులు నామపత్రాలు అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. చివరి రోజైన బుధవారం మాత్రం ప్రధాన పార్టీల, స్వతంత్ర అభ్యర్థులతో మండల కేంద్రాలన్నీ కోలాహలంగా మారాయి. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఆయా మండల్లాలోని రిటర్నింగ్ అధికారులు ఈ రోజు నామినేషన్లు పరిశీలించి... నిబంధనల ప్రకారం దాఖలు చేసిన అభ్యర్థుల పేర్లతో జాబితాలను తయారు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,166 ఎంపీటీసీ స్థానాలకుగాను 13 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయి. 197 జడ్పీటీసీ స్థానాలకుగాను 2 వేలకు పైగా నామపత్రాలు దాఖలయ్యాయి.
ఇవీ చూడండి: కాళేశ్వరం వెట్రన్ విజయవంతం... కేసీఆర్ హర్షం