ETV Bharat / state

రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: ఎంపీ రేవంత్​రెడ్డి

author img

By

Published : Jun 28, 2020, 10:27 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​కు మాల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కరోనా పరీక్షలు పెంచాలని ఐసీఎంఆర్ చెబుతున్నా... సీఎం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Mp revanth reddy letter to cm kcr over the issue of corona tests
రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: రేవంత్​రెడ్డి

రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన ఆయన... కరోనా పరీక్షలు పెంచాలని ఐసీఎంఆర్ చెబుతున్నా... సీఎం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరీక్షలు అంతంత మాత్రంగానే ఉన్నాయని... అందులోనూ 32.1 శాతం పాజిటివ్‌ కేసులు వస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో కరాళ నృత్యం చేస్తోందో... ఈ శాతాలే నిదర్శనమన్నారు.

లవ్ అగర్వాల్ నేతృత్వంలో రాష్ట్రానికి వస్తున్న కేంద్ర బృందం... కాంగ్రెస్ ఎంపీలకు అపాయింట్​మెంట్ ఇవ్వకపోవడం వెనుక సీఎం ఒత్తిడి ఉందని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలను సమీకృతం చేసి కరోనాను ఎదుర్కొనే ప్రణాళిక రచించాలన్నారు. కరోనా విషయంలో మొదటి నుంచి ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వీఐపీల ప్రాణాలకు ఇస్తోన్న విలువ పేద- మధ్య తరగతి ప్రజలకు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం కంటే స్మశానానికి వెళ్లడం మేలన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఎగతాళి చేశారని, పారాసిటమల్ వేసుకుంటే చాలని ప్రజలను తప్పుదోవపట్టించారని ఎద్దేవా చేశారు.

ఇవీ చూడండి: కరోనాపై ఆందోళన అవసరం లేదు.. అన్నీ సిద్ధంగా ఉన్నాయి: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.