ETV Bharat / state

నిజాం నిధిని దోచుకోడానికే సచివాలయం కూల్చివేత: రేవంత్​

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాం నిధిని దోచుకోడానికే సచివాలయం కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దాదాపు రెండు వారాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనిపించకుండా అజ్ఞాతంలోకి జారుకున్నారని విమర్శించారు. ఆరా తీస్తే ..."ఆపరేషన్ ఖజానా'' వ్యవహారం బయటపడిందన్నారు.

author img

By

Published : Jul 14, 2020, 8:15 PM IST

mp revanth reddy alligations on cm kcr about secretariat
నిజాం నిధిని దోచుకోడానికే సచివాలయం కూల్చివేత: రేవంత్​

రాష్ట్రంలో అనుమానాస్పద స్థితిలో అనేక పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగిన కొంత మంది మిత్రులు తనకు ఇచ్చిన సమాచారాన్నే తాను మీడియాకు చెబుతున్నట్లు వెల్లడించారు.

గత నెల 29న సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమతి ఇచ్చిన రోజు నుంచి సీఎం ఎవరికీ కనిపించకుండా పోయారని, ఆ తర్వాత మళ్లీ ఈ నెల 10న సచివాలయం కూల్చివేతను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత అంటే జులై 11న ప్రత్యక్షమయ్యారని చెప్పారు.

వనపర్తి మహారాజ్ సంస్థానం సంపద

ఇన్ని రోజులపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం చేశారు... ఎక్కడికి వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద పోలీసులను మోహరించి, సచివాలయ ప్రాంతానికి వెళ్లే దారులన్నీ మూసివేసి వాహనాలను దారిమళ్లించి వేల మంది పోలీసుల పహారాలో సచివాలయాన్ని కూల్చారని అన్నారు.

కూల్చివేత పనులను వీడియో తీశారన్న కారణంగా ఇద్దరు కానిస్టేబుళ్లను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారన్నారు. అంత రహస్యంగా ఎందుకు కూల్చాల్సి వచ్చిందో ఆలోచిస్తే.. "ఆపరేషన్ ఖజానా'' వ్యవహారం బయటపడిందని వెల్లడించారు. హోం సైన్స్ కళాశాల కింద వనపర్తి మహారాజ్ సంస్థానం సంపద దాచిపెట్టినట్లు ఆర్కీయాలజీ డిపార్ట్​మెంట్ గతంలోనే చెప్పిందని.. నిజాం కాలంలో జీ బ్లాక్ కింద బంకర్లలో నిధులు దాచి పెట్టేవారని చరిత్ర చెబుతున్నట్లు తెలిపారు.

జీవో 183 ద్వారా రద్దు

హెచ్ఎండీఏ నోటిఫై చేసిన హెరిటేజ్ బిల్డింగ్‌ల్లో సైఫాబాద్ ప్యాలెస్ అలియాస్‌ జీ బ్లాక్ ఒకటని.. జీవో 183 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పాత సచివాలయంలో ఒక బ్లాక్ నుంచి మరో బ్లాక్ పోవాలంటే వర్షం వస్తే ఫైల్స్ తడుస్తాయని ప్రభుత్వం న్యాయస్థానానికి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

సీఎంకు అత్యంత నమ్మకస్తులైన సీఏస్, డీజీపీలతో రహస్యంగా సమీక్షించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. సాధారణంగా ప్రభుత్వ పనులన్నీ పగటిపూట మొదలవుతాయని... గుప్త నిధుల కోసం తవ్వేవారు మాత్రమే అర్ధరాత్రి పనులు చేస్తారని ఎద్దేవా చేశారు.

ఆర్కీయాలజీ, ఎన్​ఎమ్​డీసీలను కూల్చివేత పనుల్లో ఎందుకు భాగస్వామ్యం చేయలేదని నిలదీశారు. అణుబాంబు ప్రయోగం చేసేటప్పుడు కూడా ఇంత రహస్యంగా చేయరని... ఈ వ్యవహారాన్ని హైకోర్టు న్యాయమూర్తి సుమోటోగా తీసుకొని విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.

కూల్చివేతల కంటే ముందు గుప్త నిధులపై విచారణ జరగాలని, హోం సైన్స్ కళాశాల నుంచి మింట్ కాంపౌండ్, సైఫాబాద్ ప్యాలెస్ వరకు ఉన్న సొరంగం మార్గాన్ని కూడా అన్వేషణ చేయాలని కోరారు.

ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.